హైదరాబాద్(Hyderabad) నగరంలో ట్రాఫిక్ పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసిన ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ (TS34 C 1858) తో నాలుగు వేర్వేరు ద్విచక్ర వాహనాలు రోడ్లపై తిరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో తేలింది.
Phone Tapping : వారందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కొత్త అనుమానాలు బయటపెట్టిన కేటీఆర్

డూప్లికేట్ నంబర్ ప్లేట్ స్కాం
ఈ నంబర్‌కు సంబంధించిన ట్రాఫిక్ చలాన్లు అన్నీ బేగరి గోపాల్ అనే వ్యక్తి పేరిట నమోదవుతుండటంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన వద్ద ఉన్న బైక్‌కు సంబంధించినవి కాకపోయినా వరుసగా చలాన్లు వస్తుండటంతో అనుమానం వచ్చి వివరాలు పరిశీలించాడు. చాలాచోట్ల జరిగిన ట్రాఫిక్ నిబంధనల(Traffic Rule) ఉల్లంఘనలు తాను చేయలేదని గుర్తించిన ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు, వాహన రికార్డులను పరిశీలించగా ఒకే నంబర్ ప్లేట్‌ను వాడుతూ నాలుగు బైకులు నగరంలో తిరుగుతున్నట్లు నిర్ధారించారు. నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేసి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, డూప్లికేట్ నంబర్ ప్లేట్లు తయారు చేసిన వారితో పాటు, వాటిని ఉపయోగించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటువంటి మోసాల వల్ల అమాయక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన చలాన్లను తరచూ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: