हिन्दी | Epaper

Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య

Saritha
Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య

Hyderabad Crime: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలుకానగర్లో ఓ ఏఆర్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి పాత స్నేహితుడే కత్తితో దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. పోలీసులు, ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన సుధీర్(35) చెంగిచర్లలోని ఆర్టీసీ కాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఏఆర్ కానిస్టేబుల్. చిలుకానగర్ లో ఉండే ఆటోడ్రైవర్ సంతోష్నాయక్ స్నేహం ఉంది. శనివారం రాత్రి వీరిద్దరి మధ్య వాట్సప్ చాటింగ్ జరిగింది. ఆ సమయంలో మాటామాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు.

Read Also: Diesel Buses : హైదరాబాద్ లోకి డీజిల్ బస్సులకు నో ఎంట్రీ!

Hyderabad Crime: ఎఆర్ కానిస్టేబుల్ దారుణహత్య
Hyderabad Crime: AR Constable Brutally Murdered

కత్తితో దాడి

అయితే ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో చిలుకానగర్ ప్రాంతంలోని ఆదర్శనగర్లో ఉన్న స్మశానవాటిక ఖాళీ స్థలం వద్ద కలుసుకున్నారు. సుధీర్, తన స్నేహితుడు ఇమ్రానాఖాన్తో వచ్చారు. అప్పటికే అక్కడ వేచి ఉన్న సంతోషానాయక్ కత్తి తీసి సుధీర్పై విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో సుధీర్, ఇమ్రాన్ ఖాన్ పరుగులు తీశారు. ఉప్పల్-చిలుకానగర్ మార్గంలోని ఆదర్శనగర్ సాయిబాబా ఆలయ ప్రాంతంలో సుధీర్ పడిపోయి అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870