HYD Jobs Fraud: హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ మోసం వెలుగులోకి వచ్చింది. మాదాపూర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పుకునే NSN ఇన్ఫోటెక్(infotech) సంస్థ, శిక్షణతో పాటు ఉద్యోగం కల్పిస్తామని నమ్మబలికి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 400 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని, చివరికి సంస్థ కార్యకలాపాలను అకస్మాత్తుగా నిలిపివేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.
Read Also: TG Electricity Discom: జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

ప్రస్తుతం కంపెనీ నిర్వాహకుడు అదృశ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌తో పాటు సైబరాబాద్ EOWలో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: