హైదరాబాద్: హైదరాబాద్‌లో ‘డిజిటల్ అరెస్ట్'(Digital arrest) పేరిట సైబర్ నేరాలు ఆగడం లేదు. ఎన్ని హెచ్చరికలు చేసినా, సైబర్(Cyber) నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా, నగరంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 78 ఏళ్ల విశ్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, ముంబై బాంబు పేలుళ్ల(Bomb blast) కేసులో నిందితుడిగా ఉన్నావంటూ బెదిరించి ₹51 లక్షల రూపాయలను కాజేశారు.
Read Also: Cyclone: మొంథా నష్టం ఇదీ..

ముంబై క్రైం బ్రాంచ్ పేరుతో బెదిరింపులు
సైబర్ నేరగాళ్లు తాము ముంబై క్రైం(Mumbai Crime) బ్రాంచ్ పోలీసులమని చెప్పి, వృద్ధుడిని భయపెట్టారు. మొదట ఒక వ్యక్తి ఏసీపీనని బెదిరించగా, ఆ తర్వాత మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లమని ఫోన్‌లో మాట్లాడారు. బాధితుడు వాడుతున్న సిమ్ కార్డు ముంబై బాంబు పేలుడులో వాడినట్లు ఆధారాలు దొరికాయని, ఆయన పేరు మీద మరిన్ని సిమ్ కార్డులు ఉన్నాయని భయపెట్టారు. నకిలీ నోటీసులను వాట్సాప్ ద్వారా పంపించి, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం, తాము చెప్పిన బ్యాంకు ఖాతాలకు ₹51 లక్షల రూపాయలు బదిలీ చేయాలని బెదిరించి, డబ్బును మళ్లించుకున్నారు.
విదేశీ కాల్స్, మ్యూల్ ఖాతాలు
డబ్బు బదిలీ అయిన తర్వాత సైబర్ నేరగాళ్లు సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరగాళ్లు విదేశాల నుంచి ఫోన్ చేసినట్లు, బ్యాంకు ఖాతాలు మ్యూల్ ఖాతాలుగా తేలినట్లు పోలీసులు గుర్తించారు. మ్యూల్ ఖాతాలు అందించిన వారు భారత్‌కు చెందినవారుగా తేలింది. వారం రోజుల క్రితమే 73 ఏళ్ల వృద్ధురాలిని ‘చైల్డ్ ట్రాఫికింగ్, హత్య కేసు’ల్లో నిందితురాలిగా బెదిరించి ₹1.43 కోట్లు కాజేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: