హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వానికి మరో భారీ పెట్టుబడి దక్కింది. ప్రపంచంలోనే అతిపెద్ద కాస్మొటిక్ దిగ్గజం లారియల్ (L’Oréal) నగరంలో తన తొలి గ్లోబల్ బ్యూటీ టెక్ హబ్ను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. దావోస్‌లో(Davos summit) జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ సీఈవో నికోలస్ సమావేశమై ఈ ప్రతిపాదనపై విస్తృతంగా చర్చించారు.
Read Also: TG: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేపై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్

ఈ హబ్ ద్వారా బ్యూటీ రంగంలో కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రీసెర్చ్ & డేటా అనాలిటిక్స్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా లారియల్ చేపట్టే బ్యూటీ టెక్ ప్రాజెక్టులకు హైదరాబాద్ కేంద్రంగా నిలవనుంది.
నవంబర్‌లో ప్రారంభోత్సవం
నవంబర్‌లో జరగనున్న ప్రారంభోత్సవానికి(Davos summit) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను సంస్థ ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, భవిష్యత్తులో రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసే అవకాశాలపై కూడా లారియల్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దీని ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మరింత ఊపునిచ్చే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: