ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇండియా, ఆరోగ్యరంగంలో మరో అడుగు వేసింది. హైదరాబాద్ సహా ఆరు ప్రధాన నగరాల్లో ఇంటివద్ద నుంచే డయాగ్నోస్టిక్స్ సేవలను (Diagnostics services) ప్రారంభించినట్టు ఆదివారం రోజున అధికారికంగా ప్రకటించింది. కొన్ని లక్షల మంది వినియోగదారులకు ప్రతిరోజూ సేవలు అందిస్తున్న అమెజాన్, ఇప్పుడు ఆరోగ్య పరీక్షల సేవలను సైతం ఇంటివద్దకే తీసుకురావడం విశేషం. వినియోగదారులు ఇకపై అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా హాస్పిటల్‌కు వెళ్లకుండానే ల్యాబ్ టెస్ట్‌లను బుక్ చేయవచ్చు, అపాయింట్‌మెంట్స్‌ను షెడ్యూల్ చేయవచ్చు, రిపోర్ట్‌లను డిజిటల్ రూపంలో పొందవచ్చు.
ఆరోగ్య పరీక్షలు
అమెజాన్ ప్రకటన ప్రకారం, ఈ సేవల్లో భాగంగా రక్త పరీక్షలు, యూరిన్ పరీక్షలు, పూర్తి ఆరోగ్య పరీక్షలు వంటి అనేక రకాల డయాగ్నోస్టిక్స్ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయి. వినియోగదారుల ఇంటికే సాంకేతిక నిపుణులు వచ్చి సాంపిల్స్ తీసుకుంటారు.ఇది కేవలం ఓ సేవ ప్రారంభం మాత్రమే కాదు, భారతదేశంలో డిజిటల్ హెల్త్‌కేర్ (Digital Healthcare) విప్లవానికి తొలి అడుగుగా చెప్తున్నారు నిపుణులు. ఇకపై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలంటే ఆసుపత్రి, ల్యాబ్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇంటివద్ద నుంచే సేవలు పొందండి ఆరోగ్యంగా ఉండండి.

అనుసంధానం చేస్తున్నట్టు
ఈ సేవల్ని ఆరెంజ్ హెల్త్ ల్యాబ్స్‌తో కలిపి బెంగళూరు, ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ముంబై, హైదరాబాద్ నగరాల్లో ఈ సేవల్ని తీసుకొస్తున్నట్టు అమెజాన్ (Amazon) ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్ మెడికల్ ద్వారా కంపెనీ తన ఫార్మసీ, క్లినికల్ సేవల్ని (Clinical services) అనుసంధానం చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రైమ్, నాన్-ప్రైమ్ మెంబర్స్ అందరూ టెలీమెడిసిన్ కన్సల్టేషన్ సర్వీస్, డెలివరీ బెనిఫిట్స్ పొందవచ్చునని పేర్కొన్నది. అమెజాన్ క్లినిక్ ద్వారా కస్టమర్లు లైసెన్స్‌డ్ డాక్టర్ల ద్వారా ప్రాథమిక వైద్య చికిత్సలను అందుకోవచ్చునని తెలిపింది.
Read Also: Bhatti : నాన్ టాక్స్ రెవెన్యూ ఆదాయాలు పెంచండి – భట్టి