ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశ రక్షణ వ్యూహాల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, శత్రు దేశాల వైఖరిని దృష్టిలో ఉంచుకుని, భారత ప్రభుత్వం ముందస్తు వ్యూహంగా క్షిపణి, డ్రోన్, యాంటీ-డ్రోన్ టెక్నాలజీల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మరోసారి దేశ రక్షణ తయారీ రంగంలో తన సామర్థ్యాన్ని చాటింది. బ్రహ్మోస్, ఆకాష్ వంటి కీలక క్షిపణుల తయారీతో పాటు వాటికి అవసరమైన విడిభాగాల ఉత్పత్తిని వేగవంతం చేయాలని సంబంధిత తయారీదారులకు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ – మిస్సైల్ మేకింగ్‌కు కేంద్ర బిందువుగా మారిన నగరం
హైదరాబాద్‌లో ఇప్పటికే DRDO, BDL (Bharat Dynamics Limited), BEL, RCI (Research Centre Imarat) వంటి ప్రభుత్వ సంస్థలతో పాటు, అనేక ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలు స్థాపించబడ్డాయి. క్షిపణి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ప్రాధాన్యత భారతదేశపు “మిస్సైల్ క్యాపిటల్”గా పేరుగాంచిన హైదరాబాద్, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ రక్షణ తయారీ సంస్థలకు నిలయంగా ఉంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) వంటి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు, అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (KRAS), ఎంటీఏఆర్ టెక్నాలజీస్, ఆస్ట్రా మైక్రోవేవ్, అనంత్ టెక్నాలజీస్, రఘు వంశీ, జెన్ టెక్నాలజీస్, ఎస్ఈసీ ఇండస్ట్రీస్ వంటి అనేక ప్రైవేట్ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. క్షిపణి వ్యవస్థలకు కీలకమైన సబ్-సిస్టమ్‌లను ఈ సంస్థలు సరఫరా చేస్తాయి.
ప్రభుత్వం నుంచి ఉత్పత్తుల వేగవంతంపై స్పష్టమైన ఆదేశాలు
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత ప్రభుత్వం ఉత్పత్తి వేగవంతంపై తయారీదారుల స్పందన ఆకాష్ ఇంకాబ్రహ్మోస్ క్షిపణులకు కీలక విడిభాగాలను సరఫరా చేసే హైదరాబాద్‌లోని ఒక సంస్థ ప్రమోటర్ మాట్లాడుతూ, డెలివరీలను వేగవంతం చేసేందుకుగాను వారాంతాల్లో కూడా పనిచేయమని తమను కోరినట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌కు ముందు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) నుండి క్షిపణుల కోసం పెద్ద ఎత్తున అత్యవసర కొనుగోలు ఆర్డర్ వచ్చిందని, అయితే ఆపరేషన్ ప్రారంభమయ్యాక ప్రభుత్వం నిరంతరం సంప్రదిస్తూ వారానికోసారి డెలివరీలను కోరుతోందని మరో సంస్థ ప్రమోటర్ వెల్లడించారు. వీరు వ్యూహాత్మక క్షిపణులు, యూఏవీల నుండి ప్రయోగించే ఖచ్చితత్వంతో కూడిన క్షిపణుల కోసం ప్రొపల్షన్ సిస్టమ్‌లను సరఫరా చేస్తున్నారు.
డ్రోన్, యాంటీ డ్రోన్ టెక్నాలజీలో హైదరాబాద్ ప్రాముఖ్యత
హైదరాబాద్లోని అనేక స్టార్టప్‌లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్, డ్రోన్ న్యూట్రలైజేషన్ టెక్నాలజీలు అభివృద్ధి చేస్తున్నాయి. డ్రోన్ టెక్నాలజీపై కేంద్ర దృష్టి క్షిపణులతో పాటు డ్రోన్,యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కంపెనీలతో కూడా రక్షణశాఖ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. సామర్థ్యాలను పెంచడానికి అన్ని కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారని ఒక డ్రోన్ టెక్ కంపెనీ వ్యవస్థాపకుడు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక రక్షణ మరియు పోర్ట్-సంబంధిత మౌలిక సదుపాయాల రక్షణ కోసం వీరి యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను ఉపయోగించారు. అన్ని విభాగాల కమాండర్లకు నేరుగా పరికరాలు కొనుగోలు చేసే హక్కులు ఇచ్చారని, రాబోయే రెండు, మూడు నెలల్లో పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు.
బాలాకోట్ దాడుల్లోనూ హైదరాబాద్ క్షిపణుల హవా
2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ లో వాడిన స్పైస్ 2000 క్షిపణులు, హైదరాబాద్‌లోని కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్(KRAS) సంస్థ తయారు చేసినవే కావడం గర్వకారణం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆపరేషన్ సిందూర్ కోసం కూడా స్పేస్ క్షిపణులను సిద్ధం చేసినప్పటికీ, భారత వైమానిక దళం చివరకు స్కాల్ప్ మరియు హామర్ ఎయిర్-టు-సర్ఫేస్ క్షిపణులను ఉపయోగించింది. దేశ రక్షణ సన్నద్ధతలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు, టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్లు, DRDO అనుబంధ పరిశోధన కేంద్రాలు, ఈ రంగానికి నాణ్యమైన మానవ వనరులను అందిస్తున్నాయి.
Read also: Hyderabad: హైదరాబాద్ లో నేడు 2 గంటల నుంచి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు