క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

Crime News :క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త

ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రదీప్‌ గుర్జార్‌ భార్య (22)ను ఎలాగైనా చంపాలని భావించాడు. ఇందుకు టీవీలో క్రైం షోలు చూసి పథకం పన్నాడు. పథకం ప్రకారం తొలుత భార్యను కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కంపూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా స్వల్ప గాయాలైనట్లు సీన్‌ క్రియేట్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు కూడా తొలుత ప్రదీప్‌ చెప్పింది నిజమేనని భావించారు.

క్రైం షోల ప్రభావంతో భార్యను హతమార్చిన భర్త


పొంతనలేని మాటలతో పోలీసులకు అనుమానం
అయితే ప్రదీప్‌ వాంగ్మూలంలోని వైరుధ్యాలు, పొంతనలేని మాటలు పోలీసులకు అనుమానం తెప్పించాయి. పైగా ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్ట్‌మార్టం పరీక్షలో తేలింది. దీంతో అనుమానంతో పోలీసులు మృతురాలి భర్త ప్రదీప్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్రైమ్ టీవీ షోలు చూసి తన భార్య హత్యకు ప్లాన్ చేశాడని విచారణలో ప్రదీప్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రదీప్‌ను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అతనితోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టం రిపోర్టులో ..
కట్నం కోసం ప్రదీప్‌ తన భార్యను వేధించేవాడంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. అసలు భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో కూడా వెల్లడైంది. పోలీసులు ప్రదీప్‌తోపాటు అతని తండ్రి రాంవీర్ గుర్జార్, అతని బంధువులు బన్వారీ, సోను గుర్జార్‌లపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Related Posts
Narendra Modi:దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను సాగనివ్వబోమన్న ప్రధాని
narendra modi

దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలులోకి రాకుండా తమ ప్రభుత్వం కట్టుబాటుగా Read more

తమిళులకు అమిత్ షా క్షమాపణలు
తమిళులకు అమిత్ షా క్షమాపణలు

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష అయిన తమిళాన్ని మాట్లాడలేకపోవడం Read more

Donald Trump: సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!
సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చైనా, మెక్సికో, కెనడాల మాదిరి భారత్‌తో Read more

Uber: ఫ్లయిట్ మిస్సయితే ఉబర్ పరిహారం చెల్లిస్తుంది
Uber: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్ – ఉబర్ నుంచి ట్రాఫిక్ భీమా!

విమాన ప్రయాణికులకు ప్రయాణ అనుభవాన్ని మరింత సులభతరం చేసే దిశగా, ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబర్ ఓ కొత్త సేవను ప్రారంభించింది. 'మిస్డ్ ఫ్లైట్ కనెక్షన్ కవర్' Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *