unnamed file

గత పదేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది..?: మంత్రి పొన్నం

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేడు గాంధీ భవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత పదేళ్లలో కేసీఆర్‌ సర్కారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు.

ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తాము చిత్తశుద్ధితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యానిధి ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యానిధి ఇస్తోందని వివరించారు.

ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలను పొన్నం ప్రభాకర్‌ ఖండించారు. ”మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నాం. రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వడంతో పాటు నిర్వాసితుల పిల్లల విద్యకు చర్యలు తీసుకుంటాం. బీసీ సంక్షేమ శాఖ, బీసీ కమిషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ శాఖ ద్వారా కులగణన చేపడతాం” అని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Related Posts
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్
indra sena reddy

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బీజేపీ సీనియర్ నేత, త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి ఫోన్‌ను నవంబర్ 2023లో 15 Read more

పశువైద్య రంగంలోకి క్రౌన్ వెటర్నరీ సర్వీసెస్
Crown Veterinary Services in the field of veterinary medicine

న్యూఢిల్లీ: మార్స్ వెటర్నరీ హెల్త్ తమ మైనారిటీ పెట్టుబడి ద్వారా భారతీయ పశువైద్య రంగంలోకి ప్రవేశించినట్లు క్రౌన్ వెటర్నరీ సర్వీసెస్ (క్రౌన్ వెట్) ఈ రోజు వెల్లడించింది. Read more

దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు
దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు కార్యాలయంలో మరియు హైదరాబాద్ లోని ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సమాచారం ప్రకారం, ఆయన సోదరుడు, Read more

గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
Fire Accident HSAGAR

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్లో జరిగిన 'భారతమాతకు మహా హారతి' కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కార్యక్రమం Read more