మీ బండిని ఫొటో తీశారా లేదా తెలుసుకోవడం ఎలా?

E Challan: మీ బండిని ఫొటో తీశారా లేదా తెలుసుకోవడం ఎలా?

ప్రతి సంవత్సరంలో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి వాహనంతో బయటకు వెళ్లిన మనిషి తిరిగి వచ్చేదాక నమ్మకం లేకుండా పోతోంది. ఎప్పుడు..? ఏ సమయాన ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. మనం ఎంత జాగ్రత్తగా వాహనం నడిపినా.. అవతలి వాడు సరిగ్గా బండి నడపకపోతే అంతే ఇక. అందుకే వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయాలంటూ..పోలీసులు ప్రతీ సంవత్సరం అవగాహన కల్పిస్తూనే ఉన్నారు.
కఠిన చర్యలు తీసుకుంటున్నా పెరుగుతున్న ప్రమాదాలు
ట్రాఫిక్‌పై అవగాహన కొరకు వారోత్సవాలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మందు సేవింవి వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ లాంటివి ఇందులో ముఖ్యంగా ఉన్నాయి. అతి వేగం కూడా ప్రమాదాలకు ముఖ్య కారణంగా ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అయితే.. ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు, పోలీసులు, శాస్త్రవేత్తలు సమిష్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా.. రోడ్డు నియమాలు ఉల్లంఘించడాన్ని నివారించడానికి సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నారు.

Advertisements
మీ బండిని ఫొటో తీశారా లేదా తెలుసుకోవడం ఎలా?

సీసీ కెమెరాల ద్వారా సమాచారం
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు చలాన్లు మాత్రమే కాకుండా.. భారీ జరిమానాలు కూడా విధించబడుతున్నాయి. ప్రధాన నగరాల ముఖ్యమైన చౌరస్తాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం.. ఈ చర్యలో కీలకమైన మార్పుగా నిలుస్తోంది. ఈ కెమెరాలు ఎక్కడ ఎలాంటి ఉల్లంఘన జరిగినా గమనిస్తున్నాయి. తద్వారా.. ఎక్కడ వాహన ప్రమాదం చోటుచేసుకుంటున్నా.. ట్రాఫిక్ నిబంధనలు ఎలా ఉల్లంఘించబడుతున్నాయో ట్రాఫిక్ పోలీసులు సరైన సమాచారం పొందగలుగుతారు.
అందుబాటులో అనేక ఆన్‌లైన్ సేవలు
దీనికి కారణం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఏర్పాటు చేసిన కెమెరాలు సిగ్నల్ జంప్ కొట్టిన వెంటనే ఆటోమేటిక్‌గా ఫొటో తీస్తుంది. దీనిని ట్రాఫిక్ కంట్రోల్ రూంతో అనుసంధానించడం వల్ల గంటల వ్యవధిలోనే వాహన రిస్ట్రేషన్‌కు లింక్ అయిన మొబైల్‌కు మెసేజ్‌ వస్తుంది. దాని గురించి ఫొటోతో సహా సమాచారం అనేది ఆన్‌లైన్‌లో తెలుసుకోవడానికి వీలుంటుంది. ట్రాఫిక్ చలాన్‌ను సులభంగా తనిఖీ చేయడం కొరకు అనేక ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. ఇది వాహనదారులకు అనేక సౌకర్యాలను కల్పిస్తుంది.
మీ చలాన్‌ను ఆన్లైన్ లో ఇలా చెక్ చేసుకోండి
ముందుగా.. మీరు మీ నగరంలో లేదా రాష్ట్రంలో ఉన్న అధికారిక ట్రాఫిక్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ మీరు వివిధ సేవల గురించి తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో ‘ఈ-చలాన్’ లేదా ‘ట్రాఫిక్ ఉల్లంఘన’ అనే విభాగంపై క్లిక్ చేయాలి. అక్కడ మీరు చలాన్ గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సెక్షన్‌లో, మీరు మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు సంబంధించిన చలాన్ వివరాలు కనిపిస్తాయి ఆ వెబ్‌సైట్‌లో సరైన CAPTCHA పూరించి ‘సమర్పించు’ బటన్‌పై క్లిక్ చేయాలి. మీరు నమోదు చేసిన వాహన వివరాలతో సంబంధం ఉన్న చలాన్ వివరాలు మీ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు
మీరు చలాన్ చెల్లించాలనుకుంటే..‘ఇప్పుడు చెల్లించండి’ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు నగదు, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. ఈ-చలాన్ వ్యవస్థను ప్రవేశపెట్టడం వల్ల ప్రజలలో ఒక జవాబుదారీ ఏర్పడుతుంది. కెమెరాలు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలను సరిగా గుర్తించడం.. వాటిని డిజిటల్ రూపంలో నమోదు చేయడం.. ఆపై చలాన్లను జారీ చేయడం చాలా సహాయకారిగా మారాయి. ఈ విధానం ద్వారా వాహనదారులు మరింత జాగ్రత్తగా ఉంటారు. కేవలం జరిమానా నుంచి తప్పించుకోవడమే కాకుండా.. ప్రమాదాల నుండి రక్షణ పొందుతారు. ఈ ప్రణాళిక ద్వారా.. ట్రాఫిక్ పోలీసులు తమ పనిని మరింత సమర్ధంగా నిర్వహించగలుగుతున్నారు.

ALSO READ: Telangana: వచ్చే విద్యాసంవత్సరం నుంచి 50 మార్కులకే సెమిస్టర్‌ పరీక్షలు

Related Posts
Tummidihetti Barrage : తుమ్మిడిహట్టి ఎత్తిపోతలపై కీలక ప్రకటన
Tummidihatti irrigation pro

తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాన్ని ఈ వేసవిలోనే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల Read more

బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం.. విద్యార్థులకు ఇబ్బందులు
Board of Intermediate Nirwakam..Students are in serious trouble

ఇంటర్ మెమోలలో తప్పుగా ప్రింట్ అయిన ఫొటోలు.. హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ నిర్వాకం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టేలా Read more

కోర్టులో లొంగిపోయిన నందిగం సురేశ్
Nandigam Suresh surrendered in court

అమరావతి ఉద్యమం సమయంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే కేసు అమరావతి : వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మళ్లీ జైలుకు వెళ్లనున్నారు. ఓ కేసు Read more

కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది- బండి సంజయ్

కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన సర్వేపై విమర్శలు గుప్పించారు. ఈ సర్వేలో అనేక లోపాలు, అవకతవకలు ఉన్నాయని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×