యూపీలోని ప్రతాప్‌గఢ్ కి చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్(Prathapsingh, Ankita singh) వివాహం మే5న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత మే24న వారు సిక్కిం(Sikkiam)కు హనీమూన్ (Honeymoon)కోసం వెళ్లారు. ఆనందంతో బయల్దేరిన ఈ జంట13 రోజులుగా సిక్కింలో కనిపించకుండా పోవటంతో ఆ రెండు కుటుంబాల వారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ దంపతుల ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. కాగా, మే 29న కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అతని భార్య అంకితా సింగ్ ప్రయాణిస్తున్న వాహనం తీస్తా నదిలో లభించింది. దాదాపు 1,000 అడుగుల లోతున వీరు ప్రయాణిస్తున్న టెంపో పడిపోయిందని పోలీసులు నిర్ధారించారు. కానీ, అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరి ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్ గాలింపులు
ఇటీవల సిక్కింలో కురిసిన కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే మే 29న సిక్కింలో కురిసిన వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మంగన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో సమీపంలో ప్రయాణిస్తున్న ఒక టెంపో 1000 అడుగుల లోతైన తీస్తా నదిలో పడిపోయింది. లాచెన్-లాచుంగ్ హైవే వెంబడి మున్సితాంగ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వారిలో ఒకరు మరణించగా.. ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కానీ మరో ఎనిమిది మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారు. వారిలో యూపీకి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
Read Also: Meghalaya Murder: కిరాయి హంతకుల ప్రయత్నం.. తానె హతమారుస్తానన్న సోనమ్