ఈ మధ్య 90ల నాటి నేపథ్యంలో వస్తున్న వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ’90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వంటి సిరీస్ ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడంతో, అదే తరహా నుంచి వచ్చిన మరో సిరీస్ ‘హోమ్ టౌన్’ కూడా నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం ఐదు ఎపిసోడ్స్‌లో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అయ్యిందో చూద్దాం.
కథ
ఒక ఫోటో స్టూడియోతో తన మిడిల్ క్లాస్ లైఫ్ ని ప్రసాద్ (రాజీవ్ కనకాల) తన భార్య (ఝాన్సీ) అలాగే పిల్లలు శ్రీకాంత్ (ప్రజ్వల్ యద్మ) అలాగే తన చెల్లెలు జ్యోతి (ఆనీ) లని వచ్చే తక్కువపాటి మొత్తం తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తారు. అయితే శ్రీకాంత్ కి సరిగా చదువు ఎక్కదు కానీ కూతురు మాత్రం బాగా చదువుతుంది. అయితే వీరి అందరి నడుమ డ్రామా ఎలా సాగింది? జ్యోతి విషయానికి వచ్చేసరికి, మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలనే ఆలోచనలో ప్రసాద్ ఉంటాడు. అయితే జ్యోతికి పై చదువులు చదువుకోవాలని ఉంటుంది. కుటుంబ ఆర్ధిక పరిస్థితి గురించి తెలిసి ఆ మాటను పైకి చెప్పలేకపోతుంది. ఎప్పుడు చూసినా జగదీశ్, శాస్త్రి అనే ఫ్రెండ్స్ తో తిరిగే శ్రీకాంత్, చదువు విషయంలో ఎప్పటికప్పుడు వెనకబడుతూ ఉంటాడు. సినిమా డైరెక్టర్ కావాలనే కోరిక అతనిలో బలంగా ఉంటుంది.తన మనసులోని మాటను తండ్రికి చెప్పడానికి భయపడిన శ్రీకాంత్, చదువు విషయంలో తల్లిదండ్రులను మోసం చేస్తూ వస్తుంటాడు. అది తెలియని ప్రసాద్ అతణ్ణి విదేశాలకు పంపించడానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అతను తన కొడుకును విదేశాలకు పంపించగలుగుతాడా? అనుకున్నట్టుగా జ్యోతి పెళ్లి చేయగలుగుతాడా? ఒక మధ్యతరగతి తండ్రిగా అతను సక్సెస్ అవుతాడా? అనేది మిగతా కథ.

విశ్లేషణ
ఇటీవల 90స్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు, సిరీస్ తరహాలోనే దీనిలో కూడా కొన్ని మూమెంట్స్ 90స్ కిడ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అప్పటి కొన్ని కొన్ని సన్నివేశాలు అలాగే ఎమోషన్స్ ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు. మెయిన్ గా మొదటి మూడు ఎపిసోడ్స్ డీసెంట్ గా సాగాయి అని చెప్పవచ్చు. ఈ మూడింటిలో కూడా రెండో ఎపిసోడ్ మాత్రం మంచి హిలేరియస్ గా సాగుతుంది.ప్రతీ ఎపిసోడ్ లో డీసెంట్ ఎమోషనల్ ఎండింగ్ ఓకే అనిపిస్తుంది.ఇక ప్రజ్వల్ నీట్ పెర్ఫామెన్స్ ని అందించాడు. పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల, ఝాన్సీలు తమ అనుభవాన్ని తమ పాత్రల్లో చూపించారు. మధ్య తరగతి కుటుంబ తల్లిదండ్రుల్లా తమ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం తాపత్రయం పడే ఇనోసెంట్ తల్లిదండ్రుల్లా చాలా బాగా చేశారు. అలానే యువ నటి ఆనీ తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. కొన్ని సన్నివేశాలు ఫ్లోలో వెళతాయి కానీ అందులో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
Also Read: OTT:ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్