OTT:ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్

OTT:ఓటీటీలోకి వచ్చేసిన హోం టౌన్ వెబ్ సిరీస్

తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా తమ యూనిక్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆహా లో స్ట్రీమింగ్‌ అవుతున్న “హోం టౌన్” వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్‌ అందుకుంటోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, తల్లిదండ్రులు–పిల్లల మధ్య అనుబంధాలు,విద్యా వ్యవస్థకు సంబంధించి యువత ఎదుర్కొనే సమస్యలను ఈ సిరీస్ లో చక్కగా చూపించారు.రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించగా, శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించిన ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Advertisements

కథ

ఒక ఫోటో స్టూడియోతో తన మిడిల్ క్లాస్ లైఫ్ ని ప్రసాద్ (రాజీవ్ కనకాల) తన భార్య (ఝాన్సీ) అలాగే పిల్లలు శ్రీకాంత్ (ప్రజ్వల్ యద్మ) అలాగే తన చెల్లెలు జ్యోతి (ఆనీ) లని వచ్చే తక్కువపాటి మొత్తం తోనే కుటుంబాన్ని నెట్టుకొస్తారు. అయితే శ్రీకాంత్ కి సరిగా చదువు ఎక్కదు కానీ కూతురు మాత్రం బాగా చదువుతుంది. అయితే వీరి అందరి నడుమ డ్రామా ఎలా సాగింది? ఎవరు ఏం చేశారు? ప్రసాద్ కోరుకున్నట్టుగా తన కొడుకు విదేశాలకి వెళ్తాడా లేదా? శ్రీకాంత్ ఏమవ్వాలి అనుకుంటాడు? తన చెల్లెలు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈ సిరీస్ లో అసలు కథ.

విశ్లేషణ

ఇటీవల 90స్ నేపథ్యంలో వచ్చిన పలు సినిమాలు, సిరీస్ తరహాలోనే దీనిలో కూడా కొన్ని మూమెంట్స్ 90స్ కిడ్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అప్పటి కొన్ని కొన్ని సన్నివేశాలు అలాగే ఎమోషన్స్ ఈ సిరీస్ లో ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు. మెయిన్ గా మొదటి మూడు ఎపిసోడ్స్ డీసెంట్ గా సాగాయి అని చెప్పవచ్చు. ఈ మూడింటిలో కూడా రెండో ఎపిసోడ్ మాత్రం మంచి హిలేరియస్ గా సాగుతుంది.ప్రతీ ఎపిసోడ్ లో డీసెంట్ ఎమోషనల్ ఎండింగ్ ఓకే అనిపిస్తుంది.ఇక ప్రజ్వల్ నీట్ పెర్ఫామెన్స్ ని అందించాడు. పలు ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసాడు. ఇక వీరితో పాటుగా సీనియర్ నటులు రాజీవ్ కనకాల, ఝాన్సీలు తమ అనుభవాన్ని తమ పాత్రల్లో చూపించారు. మధ్య తరగతి కుటుంబ తల్లిదండ్రుల్లా తమ పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం తాపత్రయం పడే ఇనోసెంట్ తల్లిదండ్రుల్లా చాలా బాగా చేశారు. అలానే యువ నటి ఆనీ తన పాత్రలో బాగా ఒదిగిపోయింది. కొన్ని సన్నివేశాలు ఫ్లోలో వెళతాయి కానీ అందులో ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.

Related Posts
సూపర్ స్టార్ జైలర్ 2 టీజర్ అదిరిపోయిందిగా..
సూపర్ స్టార్ జైలర్ 2 టీజర్ అదిరిపోయిందిగా..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'జైలర్' సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.ఆకట్టుకునే కథ, అద్భుతమైన నేపథ్య సంగీతం, స్టార్ హీరోల అతిధి పాత్రలు ఈ సినిమాకు భారీ Read more

సోషల్ మీడియాలో వైరల్ గా అనసూయ వ్యాఖ్యలు!
anasuya bharadwaj

నటి అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్త్రీ, పురుషుల మధ్య సంబంధం గురించి తన అభిప్రాయాలను పంచుకుంది, "కామం సహజమైనది" అని మరియు ఆహారం, దుస్తులు మరియు Read more

War 2 Leaked Pic: యాక్షన్ మోడ్ లో ఎన్టీఆర్.. చూశారా
war 2

ఇటీవల 'దేవర' సినిమాతో ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్, ఇప్పుడు 'వార్ 2' కోసం పూర్తిగా సిద్ధమయ్యాడు. ఈ సినిమా గురించి ప్రతీ అప్‌డేట్ ఆసక్తికరంగా మారుతుండగా, Read more

అవార్డ్ విషయంలో బన్నీ నిర్ణయానికి అప్లాజ్
allu arjuns

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం పుష్ప తో సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×