దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు దిశగా కదిలి ప్రస్తుతం తమిళనాడు (Tamil Nadu) నుంచి ఆంధ్రప్రదేశ్ (AP) వైపు అడుగులు వేస్తోంది. వాతావరణ శాఖ పేర్కొనిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనం రానున్న రోజుల్లో తుపాను(Thoofan)గా మారే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, వర్షాలు కురిసే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని, వర్షం సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచనలు జారీ చేసింది. ఏపీలో విజయనగరం, పార్వతీపురం, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
తెలంగాణ లోను భారీ వర్షాలు
తెలంగాణలోనూ వర్షాల ముప్పు నెలకొంది. సాయంత్రం 5 గంటల తర్వాత పశ్చిమ తెలంగాణలో వర్షం మొదలై రాత్రంతా కురిసే అవకాశం ఉంది. గద్వాల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి లేకుండా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
Read Also : India – Pakistan War : కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్