Winter health tips: చలికాలం ప్రారంభమయ్యే సరికి శరీరానికి అవసరమైన పోషకాలు, ఆహారపు అలవాట్లపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో తప్పైన ఆహారపు పద్ధతులు పాటిస్తే బరువు పెరగడం, జీర్ణక్రియ మందగించడం(Slow digestion), రోగనిరోధక శక్తి(Immunity) తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
Read Also: Vitamin C:రోజూ మోసంబి జ్యూస్ తాగితే కలిగే ఆరోగ్య లాభాలు
చలికాలంలో చాలామంది ఇమ్యూనిటీ పెరుగుతుందనే భావనతో ఉసిరి క్యాండీలు, చ్యవన్‌ప్రష్, డ్రైఫ్రూట్ లడ్డూలు, ప్యాకెట్ రెడీమేడ్ సూపులు, అలాగే అధికంగా నెయ్యి వంటి కొవ్వు పదార్థాలను తీసుకుంటుంటారు. కానీ ఇవి పరిమితికి మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకలి ఎక్కువగా అనిపించడం సహజమే. అయితే ఆ ఆకలిని జంక్ ఫుడ్ లేదా అధిక కొవ్వు పదార్థాలతో తీర్చకుండా పోషకాహారంతో తీర్చుకోవడం చాలా ముఖ్యం.

నిపుణుల సూచనల ప్రకారం, తాజా కూరగాయలతో తయారు చేసిన ఇంటి సూపులు, కాయగూరల కూరలు, పండ్లతో చేసిన సహజ జ్యూసులు తీసుకోవడం ఉత్తమం. అలాగే బాదం, వాల్‌నట్, జీడిపప్పు వంటి గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, గుమ్మడికాయ గింజలు వంటి విత్తనాలు కూడా చలికాలంలో ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడతాయి. తగినంత నీరు తాగడం, గోరువెచ్చని నీటిని అలవాటు చేసుకోవడం ద్వారా జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సమతుల్యమైన ఆహారం, సరిపడిన నిద్ర, తేలికపాటి వ్యాయామంతో చలికాలాన్ని ఆరోగ్యంగా ఎదుర్కోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: