हिन्दी | Epaper

Weight Loss : బరువు పెరుగుతున్నారా.. ఐతే కొన్ని చిట్కాలు పాటించండి

Sudha
Weight Loss : బరువు పెరుగుతున్నారా.. ఐతే కొన్ని చిట్కాలు పాటించండి

బరువు తగ్గేందుకు ఆహారపు మోతాదు తగ్గించడం, పదార్థాల్లో మార్పులు చేసుకోవడం మాత్రమే కాదు. ఆహారం పట్ల మన దృక్పథాన్ని కూడా స్పష్టంగా, సానుకూలంగా ఉంచుకోవాలని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. మనసు నిండా అపరాధ భావన పెట్టుకుని ఆరోగ్యకరమైనది తిన్నా సరే, అది శరీరానికి అనారోగ్యాన్నే చేకూరుస్తుందని అంటున్నారు. అందుకే బరువు తగ్గే ( Weight Loss) క్రమంలో ఆహారంతో మన అనుబంధం (attachment)ఎలా ఉండాలన్నదానికి సంబంధించి కొన్ని సూచనలు చేస్తున్నారు. మైండ్‌ఫుల్‌నెస్‌ అనేది ఏ పనిలోనైనా ముఖ్యమే. అంటే చేస్తున్న పని మీద పూర్తి ఏకాగ్రత. అలాగే ఆహారం విషయంలోనూ. మనం ఏం తింటున్నాం, దాని రంగు, ఆకృతి, పోషకాలు, రుచి… వీటన్నింటినీ అనుభవిస్తూ తినడం వల్ల పొట్టకు తిన్న అనుభూతితో పాటు శరీరానికి ఆరోగ్యం చేకూరుతుంది. బరువు తగ్గాలంటే ( Weight Loss)ఇది ఈ సమయంలో ఇంతే తినాలి… అన్నట్టుగా కాకుండా, ఒక రోజు మొత్తంలోనో ఒక వారం మొత్తంలోనో మనం పూర్తి చేయవలసిన ఆహార లక్ష్యాలను పెట్టుకుని, వాటిని మనసుకు నచ్చిన వేళల్లో నచ్చిన విధంగా తినే ఏర్పాటు చేసుకుంటే పని సులభం అవుతుంది.

 Weight Loss :   బరువు పెరుగుతున్నారా.. ఐతే కొన్ని చిట్కాలు పాటించండి
Weight Loss : బరువు పెరుగుతున్నారా.. ఐతే కొన్ని చిట్కాలు పాటించండి

అప్పుడప్పుడు మనం టెంప్ట్‌ అయిపోయి తినవద్దు అనుకున్న ఆహారాన్ని కూడా తినేస్తుంటాం. అలాంటప్పుడు ‘ఇంక ప్లాన్‌ మొత్తం నాశనం అయిపోయినట్టే’… అని ఫీల్‌ అవ్వకుండా, ఇవాళ నాకు నచ్చిన ఆహారాన్ని ఎంజాయ్‌ చేశాను, రేపటి నుంచి మళ్లీ నా ప్రణాళికను అనుసరిస్తాను అనుకోవచ్చు. లేకపోతే అపరాధ భావనతో కీరాదోసకాయలాంటి ఆరోగ్యకరమైన దాన్ని తిన్నా, అది కూడా మన బరువు పెరిగేలా పనిచేస్తుంది. పూర్తిగా నములుతూ, నెమ్మదిగా, ఆకలిని గమనిస్తూ ఆహారం తీసుకోవడం అన్నది హాయిగా బరువు తగ్గేందుకు ( Weight Loss)ఒక మంచి చిట్కా. ఇలా గమనించడం వల్ల నిజమైన ఆకలి లేదా ఊరికే ఆకలిలాగా కలిగే సంకేతాల మధ్య తేడా పసిగట్టవచ్చు. ఎవరైనా నచ్చిన ఆహారాన్ని తినేందుకు అర్హులే. కానీ కొన్ని లక్ష్యాలు సాధించడం కోసం మార్పులు చేసుకున్నా, మనం వాటిని పూర్తి స్థాయిలో పాటించలేకపోవచ్చు. అలాంటప్పుడు మనకు చేతకాదు, నియంత్రణ లేదు.. ఇలా అనుకోకుండా, ఎదుటి వారి పట్ల చూపినట్టే మన పట్ల మనం కూడా సహానుభూతి చూపించుకోవచ్చు. అలా చేయడం వల్ల మరింత బలంగా తయారవుతాం.

బరువు తగ్గడానికి నియమాలు ఏమిటి?

మీరు బర్న్ చేసే దానికంటే తక్కువ కేలరీలు తిన్నప్పుడు బరువు తగ్గడం జరగాలి. మీ కేలరీలను పరిమితం చేస్తూ శారీరక శ్రమను పెంచడం వల్ల మీ బరువు తగ్గే రేటు పెరుగుతుంది. శారీరక శ్రమను పెంచడం వల్ల బరువు తగ్గిన తర్వాత మీ బరువును నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఏ మార్గదర్శకాలు సరైనవి?

ఆహారం కేలరీలకు సమానం కాబట్టి, బరువు తగ్గడానికి మీరు తక్కువ కేలరీలు తినాలి, కార్యాచరణతో కేలరీలను బర్న్ చేయడానికి ఎక్కువ వ్యాయామం చేయాలి లేదా రెండూ చేయాలి. శరీరానికి ఇంధనంగా ఉపయోగించని ఆహారం కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. బరువు తగ్గడంలో ప్రధాన భాగం తెలివిగా ఆహార ఎంపికలు చేసుకోవడం.

సహజంగా బరువు తగ్గడం ఎలా?

శరీర కొవ్వును తగ్గించుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి చురుకైన నడక వంటి స్థిరమైన ఏరోబిక్ వ్యాయామం . వారంలో చాలా రోజులు కనీసం 30 నిమిషాల వరకు ఏరోబిక్ వ్యాయామం చేయండి. కొంతమందికి బరువు తగ్గడానికి మరియు దానిని దూరంగా ఉంచడానికి దీని కంటే ఎక్కువ వ్యాయామం అవసరం కావచ్చు. అలాగే వారానికి కనీసం రెండుసార్లు బల శిక్షణ వ్యాయామాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/excess-jaggery-consumption-harmful-to-health/more/health-more/532704/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870