డయాబెటిస్ (Diabetes) అనే జీవనశైలి వ్యాధి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా భారతదేశంలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. డయాబెటిస్ ఉన్నవారిలో బ్లడ్ షుగర్ స్థాయులు అదుపులో లేకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే కొన్ని సరళమైన ఆరోగ్యలనూ, ఆహార నియమాలనూ పాటించడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయులను క్రమంగా నియంత్రించుకోవచ్చు. ఈ క్రింది చిట్కాలు మీకు సహాయపడతాయి.

బ్లడ్ షుగర్ స్థాయులను నియంత్రించే చిట్కాలు
నీరు తాగడం పెంచండి
నీరు తాగడం డీహైడ్రేషన్ ను నివారించడమే కాదు, బాడీలోని గ్లూకోజ్ ను మూత్రం ద్వారా బయటకు పంపించి బ్లడ్ షుగర్ లెవెల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు శుద్ధి చేసిన నీటిని తాగండి.
దాల్చిన చెక్క ఉపయోగించండి
దాల్చిన చెక్కలో ఉండే సినమాల్డిహైడ్ అనే పదార్థం ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది షుగర్ శోషణను తగ్గించడంతో పాటు గ్లూకోజ్‌ను కంట్రోల్ చేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది.
ప్రతి రోజు వ్యాయామం
నియమితమైన వ్యాయామం ద్వారా శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. వాకింగ్, జాగింగ్, యోగా, స్విమ్మింగ్ లాంటి వ్యాయామాలు చాలా బాగా పనిచేస్తాయి. కనీసం 30 నిమిషాల పాటు నడక చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోండి
గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు షుగర్‌ను మెల్లగా పెంచుతాయి. వీటిలో ఓట్స్, చియా సీడ్స్, గ్రీన్ leafy vegetables, బాదం, వాల్ నట్స్, ఆపిల్, పెరుగు, ప్రతి భోజనంలో ఎక్కువగా ఈ పదార్థాలు చేర్చండి.
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడకం
ఆపిల్ సైడర్ వెనిగర్ బ్లడ్ గ్లూకోజ్ శోషణను తగ్గించి శరీరంలోని ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచుతుంది. భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో 1-2 టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి తాగవచ్చు. అయితే దీనిని వాడేటప్పుడు డాక్టర్ సూచన తీసుకోవడం మంచిది.

స్ట్రెస్ ను తగ్గించుకోండి
మెదడులో స్థిరంగా ఉండే కార్టిసాల్ హార్మోన్ అధికంగా ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే ధ్యానం, ప్రాణాయామం, మైండ్‌ఫుల్‌నెస్ సాధన ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. టెన్షన్ తగ్గితే షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అన్నం, మైదా, పంచదార, తెల్ల రొట్టెలు వంటి అధిక ప్రాసెస్డ్ ఫుడ్స్ గ్లూకోజ్ శోషణను వేగంగా పెంచుతాయి. వీటి బదులు రాగి, బాజ్రా, జొన్న వంటి సంప్రదాయ ధాన్యాలను వాడాలి.
ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోండి
ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు మెల్లగా జీర్ణమై, గ్లూకోజ్ రీలీజ్‌ను కంట్రోల్ చేస్తాయి. ఉదాహరణకు గుడ్లు, చికెన్, ఫిష్, గ్రీక్ యోగర్ట్, పన్నీర్, కాబూలీ చెన్నాలు ఈ ఆహారాలు బరువు తగ్గించడంలో కూడా సహాయపడతాయి, ఇది డయాబెటిస్ కంట్రోల్‌లో ప్రధానంగా పనిచేస్తుంది.
క్రమం తప్పకుండా షుగర్ లెవెల్ చెక్ చేయండి
ఎంత ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకున్నా, బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉంటే ప్రమాదం. అందువల్ల వారం లేదా పది రోజులకు ఒకసారి గ్లూకోజ్ లెవెల్‌ని పరిశీలించండి. హై షుగర్ లేదా లో షుగర్ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుని సంప్రదించండి. ప్రతి రాత్రి కనీసం 7-8 గంటల నిద్ర తీసుకోవడం చాలా ముఖ్యం. నిద్ర లోపం కూడా హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది బ్లడ్ షుగర్ పెరగడానికి కారణమవుతుంది.
Read also: Dr. Nageshwar Reddy: త్వరలో స్మార్ట్ టాయిలెట్లు: డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి