మొటిమలు, కాలుష్యం, అధిక నూనె ఉత్పత్తి(Skin Care Remedies) కారణంగా చాలామందికి ముఖంపై ఓపెన్ పోర్స్ సమస్య ఎదురవుతుంది. ఈ సమస్యను తగ్గించేందుకు సహజ పదార్థాలతో తయారు చేసే ఫేస్ ప్యాక్స్ మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ కోసం ముల్తానీ మట్టి,(Skin Care Remedies) కొద్దిగా పసుపు, రోజ్ వాటర్ కలిపి మృదువైన పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సమానంగా అప్లై చేసి సుమారు 15 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని మెల్లగా మసాజ్ చేస్తూ కడగాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వాడితే ఓపెన్ పోర్స్ తగ్గడంలో సహాయపడుతుంది.
ఇక మరో మంచి పరిష్కారం శనగపిండి ఫేస్ ప్యాక్. శనగపిండిని నీరు లేదా రోజ్ వాటర్‌తో కలిపి ముఖానికి రాసుకుంటే చర్మంలోని మలినాలు తొలగి, పోర్స్ కుదించబడతాయి. క్రమం తప్పకుండా వాడితే చర్మం తాజాగా కనిపిస్తుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: