ఆరోగ్యవంతమైన జీవనశైలికి ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ (Breakfast ) చేసుకోవడం ఎంతో ముఖ్యం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా బ్రేక్ ఫాస్ట్‌ను తప్పించుకుంటూ ఉంటారు. అయితే, ఇది శరీరానికి కావాల్సిన శక్తిని తగ్గించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయాన్నే శక్తివంతమైన, పోషకతత్వం కలిగిన ఆహారం తీసుకోవడం శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
లైట్ కాదు.. కడుపు నిండా తినాలి
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ను లైట్‌గా కాకుండా కడుపు నిండా తినాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. మధ్యాహ్నం ఆహారం కొద్దిగా తినడం, రాత్రి మరింత తక్కువగా తినడం ఉత్తమం. ఈ నియమాలను పాటిస్తే బీపీ, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు. శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఇది సహాయపడుతుంది.
సమతులాహారమే రహస్యము
బ్రేక్ ఫాస్ట్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్ వంటి అన్ని పోషకాల సమతుల్య మిశ్రమం ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు ఇడ్లీ, దోస, అట్లతో పాటు పప్పు, కూరగాయలు, గుడ్డు, పాలు వంటి పోషక పదార్థాలను చేర్చడం మంచిది. ఈ విధంగా మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల దినచర్యలో శక్తి, ఉత్సాహం, చురుకుదనం కలుగుతాయి.
Read Also : Donald Trump : కాళ్ల సిరల వ్యాధితో బాధపడుతున్న డొనాల్డ్ ట్రంప్