ఎండుద్రాక్షలు మనకు తెలుసు, కానీ వాటిని నానబెట్టి తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఎంతోమంది తెలియకపోవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షలను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో విధాలుగా మేలు జరుగుతుంది.
జీర్ణవ్యవస్థకు బలాన్నిచ్చే ఫైబర్ పుష్కలంగా
ఎండుద్రాక్ష నీటిలో ఫైబర్ అధికంగా ఉండటంతో, ఇది మన జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే సహజ మార్గంగా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉన్న హానికర టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే తీసుకుంటే అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.

గుండె ఆరోగ్యానికి అద్భుతమైన సహాయకుడు
ఎండుద్రాక్ష నీటిలో ఉండే పొటాషియం గుండె పనితీరును మెరుగుపరచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. ఇది బీపీని నియంత్రించడంలో(controlling BP), స్ట్రోక్‌లను నివారించడంలో, గుండె జబ్బులను అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంది. ముఖ్యంగా వయస్సు మీదపడుతున్న వారికి ఇది చక్కటి సహాయంగా ఉంటుంది.
రక్తహీనతకు పరిష్కారంగా
ఎండుద్రాక్షలో ఐరన్ (Iran)పుష్కలంగా ఉండటం వలన, రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇది రక్తహీనత (అనీమియా) సమస్యతో బాధపడే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలసట, నీరసం వంటి సమస్యల నుండి బయటపడటానికి ఇది సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గించి ఎనర్జీని పెంచే టానిక్
ఉదయాన్నే ఎండుద్రాక్ష నీరు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపర్చడం, ఒత్తిడిని తగ్గించడం వంటి లాభాలను కలిగిస్తుంది. పని ఒత్తిడిలో ఉండే ఉద్యోగులు దీన్ని తినడం వల్ల దైనందిన జీవితం మరింత చురుకుగా సాగుతుంది.

ఎముకల బలం కోసం సహజ కాల్షియం
ఎండుద్రాక్షలలో కాల్షియం కూడా ప్రాముఖ్యంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలంగా మారటమే కాకుండా, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముకల వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. పెద్దవారితో పాటు యువత కూడా దీన్ని ఆహారంలో చేర్చుకోవాలి.
రోగనిరోధక శక్తిని పెంచే సహజ ఆయుధం
నానబెట్టిన ఎండుద్రాక్షలు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఇమ్యూనిటీని పెంచుతూ, సాధారణ సీజనల్ ఇన్‌ఫెక్షన్లను కూడా అడ్డుకుంటాయి. వర్షాకాలంలో లేదా శీతాకాలంలో ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: