QR Code: దేశంలో పెరుగుతున్న నకిలీ మందుల సమస్యను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ఔషధాల ప్యాకెట్లపై క్యూఆర్ (QR Code) కోడ్ ముద్రించడం తప్పనిసరి చేసింది. ఈ విధానం ద్వారా ప్రజలు తాము కొనుగోలు చేసే మందు నిజమైనదా లేదా సులభంగా తెలుసుకోవచ్చు. ‘ట్రాక్ అండ్ ట్రేస్’ పేరుతో ప్రారంభమైన ఈ వ్యవస్థ ద్వారా మందుల తయారీ నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు పూర్తి వివరాలు పారదర్శకంగా అందుబాటులో ఉంటాయి.
Read also: UttarPradesh Crime: కూతురు ప్రవర్తనపై ఆగ్రహంతో తల్లిదండ్రులే హత్య

QR Code: మీరు వాడుతున్న మందు నకిలీదా?
ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే
QR Code: వినియోగదారులు తమ మొబైల్‌తో మందు ప్యాకెట్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే, ఆ ఔషధానికి సంబంధించిన తయారీదారు పేరు, బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, గడువు తేదీ, లైసెన్స్ నంబర్ వంటి వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మొదటి దశలో 300 రకాల మందులకు ఈ నిబంధన వర్తిస్తుంది. క్యూఆర్ కోడ్ లేకపోతే లేదా స్కాన్ చేసినప్పుడు సరైన వివరాలు రాకపోతే, ఆ మందు నకిలీ అయి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: