దేశంలో పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 290 జిల్లాల్లో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ జిల్లాలు చోటుచేసుకున్నాయి. అలాగే వరంగల్ నగరంలోని పట్టణ ప్రాంతంలో కూడా ఈ నెల 12న పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనుంది. 0 నుండి 5 సంవత్సరాల వయస్సు గల చిన్నారులకు పోలియో డ్రాప్స్ అందజేయాలని అధికారులు వెల్లడించారు.
Educational Institutions Strike : తెలంగాణలో విద్యా సంస్థల సమ్మె వాయిదా
కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఇటీవల బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో పోలియో కేసులు తిరిగి వెలుగుచూస్తున్నాయి. ఈ దేశాల నుంచి భారత్‌కు రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో, ఏవైనా వైరస్ కేసులు దేశంలోకి చొరబడే ప్రమాదాన్ని ముందస్తుగా నివారించడమే ఈ డ్రైవ్ లక్ష్యమని చెప్పారు. ప్రతి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు వంటి ప్రదేశాల్లో పోలియో బూత్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఈ డ్రైవ్ విజయవంతం కావడానికి ఆరోగ్య శాఖ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించింది. ప్రతి జిల్లాలో మెడికల్ టీమ్‌లు, వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది నియమించబడ్డారు. తల్లిదండ్రులు తమ పిల్లలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకువెళ్లి పోలియో డ్రాప్స్ వేయించడం ద్వారా దేశాన్ని పోలియోరహిత భారతంగా నిలబెట్టడంలో భాగస్వాములు కావాలని వైద్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలియో పూర్తిగా నిర్మూలించబడిన తర్వాత కూడా ఇటువంటి జాగ్రత్త చర్యలు కొనసాగించడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/