వెయిట్ లాస్ అంటే చాలామందికి చాలా తలనొప్పి. కొన్ని రోజుల పాటు డైట్ పాటించడం, జిమ్ వెళ్లడం తర్వాత కూడా ఫలితాలు కనబడకపోతే నిరుత్సాహం కలుగుతుంది. అయితే, ప్రకృతి ఇచ్చిన కొన్ని పదార్థాల సమ్మేళనం వల్ల ఈ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది. అందులో ఒకటి — బ్లాక్ కాఫీతో నిమ్మరసం కలిపి తాగడం.

కెఫిన్ + విటమిన్ C: శరీరంలో కొవ్వు కరిగించే శక్తివంతమైన కాంబో
బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ శరీర చురుకుదనాన్ని పెంచుతుంది. ఇది మెటాబాలిజంను వేగవంతం చేస్తుంది. అలాగే నిమ్మరసంలో ఉండే విటమిన్ C శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. ఈ రెండు పదార్థాలు కలిస్తే, ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ మరింత వేగంగా జరుగుతుంది. అందువల్ల శరీరంలోని అదనపు కొవ్వు త్వరగా కరుగుతుంది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది – మలబద్ధకం, గ్యాస్ కు చెక్!
కాఫీకి ఉన్న ఆస్ట్రింజెంట్ లక్షణాలు జీర్ణక్రియను ప్రేరేపిస్తాయి. ఇక నిమ్మరసం తీసుకుంటే, పుల్లటి రుచి వల్ల జీర్ణ వ్యవస్థ మరింత చురుకుగా పనిచేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్లాక్ కాఫీలో నిమ్మరసం కలిపి తాగితే, కడుపు శుభ్రంగా ఉండటంతో పాటు మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
మానసిక స్థితిలో సానుకూల మార్పులు
బ్లాక్ కాఫీ వల్ల mentally alert గా ఉండే అవకాశముంది. నిమ్మరసం శరీరానికి ఫ్రెష్ నెస్ ఇస్తుంది. ఈ రెండు కలిస్తే మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, ఆలోచనా శక్తి, ఫోకస్, మరియు ఉత్సాహం పెరుగుతాయి. అలసట, మానసిక బద్ధకాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి సహకారం
నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C అధికంగా ఉంటాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగించి, చర్మానికి సహజ కాంతి తీసుకురాగలవు. కాఫీ కూడా శుభ్రపరిచే గుణం కలిగి ఉంది. కాబట్టి ఈ రెండు కలిస్తే, చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా తయారవుతుంది.
రోగనిరోధక శక్తికి బలమిచ్చే పానీయం
విటమిన్ C శరీర రోగనిరోధక వ్యవస్థను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో బ్లాక్ కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. కాబట్టి ఈ మిశ్రమం తాగడం వల్ల జలుబు, జ్వరం వంటి చిన్న వ్యాధులపై నేచురల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది.
మైగ్రేన్ మరియు తలనొప్పులకు ఉపశమనం
కొన్ని సందర్భాల్లో, బ్లాక్ కాఫీతో నిమ్మరసం కలిపి తాగడం వల్ల తలనొప్పులు, మైగ్రేన్ వంటి సమస్యలకు ఉపశమనం లభించవచ్చు. కెఫిన్ నాడీవ్యవస్థపై ప్రభావం చూపి, తలనొప్పిని తక్కువ చేస్తుంది. నిమ్మరసం హైడ్రేషన్‌ను మెరుగుపరచడంతో బలహీనత తగ్గుతుంది.

వ్యాయామానికి ముందు శక్తిని అందించే ప్రకృతి కాఫీ
వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ + నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇది workout performance ను మెరుగుపరుస్తుంది. శరీరం ఎక్కువ కాలం చురుకుగా ఉండటంతో కేలరీలు అధికంగా దహనమవుతాయి, ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
ఎటువంటి ఆహారం లేదా పానీయం అయినా మితిమేరకు తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. అదే అధిక మోతాదులో తీసుకుంటే ఆసిడిటీ, నిద్రలేమి, వంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు ఒకసారి లేదా రెండు రోజులకు ఒకసారి మాత్రమే ఈ మిశ్రమాన్ని తాగడం మంచిది. బ్లాక్ కాఫీ + నిమ్మరసం అనే ఈ సహజ కాంబినేషన్, బరువు తగ్గాలనుకునే వారు, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలనుకునే వారు, చర్మ ఆరోగ్యం మెరుగుపరచుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది.
Read also: Neck Pain : మెడ నొప్పితో బాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు పాటించండి