చాలా మందికి రాత్రుల్లో నిద్రించే ముందు మొబైల్‌ను దిండు దగ్గర పెట్టుకునే అలవాటు ఉంటుంది. రాత్రుల్లో కూడా మొబైల్‌ను వాడుతూ నిద్రించే సమయంలో ఆ మొబైల్ ( Mobile )ను దిండు కింద పెట్టుకుంటారు. మరి అలా రాత్రి పూట దిండు దగ్గర మొబైల్ పెట్టుకుని నిద్రించడం మంచిదేనా? ఇలా మొబైల్ ఫోన్‌ను దిండు దగ్గర ఉంచుకోవడం వల్ల మెదడు (brain) దెబ్బతింటుందంటుంటారు. అది విడుదల చేసే రేడియేషన్ (Radiation)వల్ల మరణం కూడా సంభవించవచ్చు.

ఆరోగ్యానికి ప్రమాదకరం
మొబైల్ ఫోన్ రేడియేషన్ మెదడుకు ప్రత్యక్షంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని WHO, ఇతర ప్రధాన సంస్థలు ఇంకా ఎటువంటి దృఢమైన శాస్త్రీయ ఆధారాలను కనుగొనలేకపోయినా.. ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. ఈ రోజుల్లో చాలా మంది మొబైల్ ఫోన్లకు ఎంతగా బానిసలయ్యారంటే, నిద్రపోయేటప్పుడు కూడా వాటిని దిండు దగ్గర పెట్టుకుని వాడుకుంటున్నారు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి ప్రమాదకరం. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది.
మెదడుపై ప్రతికూల ప్రభావం
నిరంతర నోటిఫికేషన్లు, కంపనాలు లేదా కాంతి కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల సరైన నిద్ర పట్టదు.మొబైల్ ఫోన్ల నుండి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల ‘నీలి కాంతి’ వస్తుంది. ఇది కళ్ళకు అలసట కలిగిస్తుంది. సహజ నిద్ర చక్రానికి అంతరాయం కలిగిస్తుంది.నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.కొన్ని సంఘటనలలో మొబైల్ ఫోన్లు వేడెక్కడం, పేలడం వంటి నివేదికలు వచ్చాయి. అందువల్ల మొబైల్ ఫోన్‌ను దిండు పక్కన ఛార్జ్‌లో ఉంచుకోవడం ప్రమాదకరం.వీలైతే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీ నుండి కొంచెం దూరంగా ఉంచండి. ముఖ్యంగా ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిని దిండు కింద లేదా ఏదైనా గుడ్డ కింద ఉంచవద్దు.
Read Also : Thick Hair: ఒతైన జుట్టు కోసం ఈ ఆహార పదార్థాలు తినండి