हिन्दी | Epaper
కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు కిడ్నీ సమస్యలను గుర్తించే కంటి సంకేతాలు సైన‌స్ స‌మ‌స్య ఉన్న‌వారికి కొన్ని చిట్కాలు.. నిద్ర లేవగానే అలసటగా ఉంటోందా? ప్రీడయాబెటిస్ లక్షణాలు ..? బొప్పాయి గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు పీరియడ్స్‌లో తలస్నానం చేయకూడదా? నిమ్మరసం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా? చలికాలం.. ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు! మైగ్రేన్‌ను శాశ్వతంగా తగ్గించే చిట్కాలు

Latest Telugu News: Fertility: సంతాన లేమికి కారణాలు.. పరిష్కారాలు ..

Vanipushpa
Latest Telugu News: Fertility: సంతాన లేమికి  కారణాలు.. పరిష్కారాలు ..

ప్రస్తుతం చాలా మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తూ, ఉన్నత పదవులు అందుకుంటున్నారు. ఇలా చదువులు, కెరీర్ ధ్యాసలో పడటం వల్ల పెళ్లి ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఒకవేళ చేసుకున్న తర్వాత సంతానం కనటాన్ని వాయిదా వేసుకుంటున్నారు. జీవితంలో స్థిరపడ్డ తర్వాతే పిల్లలను కనాలని భావిస్తున్నారు. తర్వాత సంతానం(Fertility) కలగక డాక్టర్లు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగు కావటం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండటం, పిల్లలను కన్న తర్వాత వారి ఆలనా పాలనా చూసుకునేవారు ఇంట్లో లేకపోవటం వంటివీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి పురికొల్పుతున్నాయంటున్నారు నిపుణులు.

Read Also: Cancer: గుండె లోపాలతో పుట్టిన శిశువులకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ?

Fertility
Fertility

ఆలస్యమవుతున్నకొద్దీ గర్భం కష్టం

కెరీర్ పరంగా ఇది మంచిదే కావొచ్చు కానీ, ఆలస్యమవుతున్నకొద్దీ గర్భం ధరించటం కష్టమవుతుందని వివరిస్తున్నారు. రెండు మూడేళ్లు ప్రయత్నిస్తున్నా గర్భం ధరించకపోతే దంపతులు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడినీ ఎదుర్కోవాల్సి వస్తుంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఆందోళనకు దారితీయటమే కాదు, సంతానం కలగటంలోనూ ఇబ్బందులకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. ఆ దశ పరిమితమే : మహిళల్లో సంతానం కలిగే దశ పరిమితం అని అంటున్నారు నిపుణులు. రజస్వల నుంచే ఇది మొదలైనప్పటికీ తొలినాళ్లలో అండం సరిగా విడుదల కాదని, నెలసరీ సక్రమంగా అవదని చెబుతున్నారు.

40 ఏళ్ల వయసులోపు అండాశయాలు పనిచేయడం మానేస్తాయి

అంటే, రెండు మూడేళ్ల తర్వాతే సంతానం కలిగే అవకాశముంటుందని వివరిస్తున్నారు. అంతేకాకుండా, మహిళల్లో సంతానం కలిగే అవకాశం 32 ఏళ్ల నుంచీ తగ్గుతూ వస్తుంటుందని, ఇది 37 ఏళ్లు తర్వాత గణనీయంగా పడిపోతుందని పేర్కొంటున్నారు. 40 ఏళ్ల వయసులోపు అండాశయాలు పనిచేయడం మానేస్తాయని nhs.uk అధ్యయనం పేర్కొంది. అదే, మగవారికి ఏ వయసులోనైనా సంతానాన్ని కనే సామర్థ్యముంటుందని భావిస్తుంటారని, ఇది నిజం కాదని అంటున్నారు.

రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు

ముందు నుంచే హెచ్చరికలు : సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తాయంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో నెలసరి సక్రమంగా రాకపోవచ్చని, చాలా త్వరగా కానీ, మరీ ఆలస్యంగా కానీ అవచ్చని చెబుతున్నారు. కొంత మందికి నెల కన్నా ఎక్కువ సమయం పట్టొచ్చని, మరికొందరికి కొన్ని నెలల తర్వాతా నెలసరి రావొచ్చని పేర్కొంటున్నారు. ఒకసారి రుతుక్రమం మొదలైతే ఎక్కువ కాలం కొనసాగొచ్చని తెలియజేస్తున్నారు. PCOS ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ముఖం లేదా శరీరంపై అసాధారణ జుట్టు పెరుగుదల, మొటిమలతో సంబంధం కలిగి ఉంటుందని అధ్యయనం పేర్కొంది.

పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు

హార్మోన్ల మోతాదులు మామూలుగా ఉన్నా కూడా కొన్ని అవయవ సమస్యలూ సంతానం కలగటంలో ఇబ్బందులు రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గర్భాశయం లోపలి పొరలు అయినా ఎండోమెట్రియం గర్భసంచి వెలుపలా పెరుగుతుందని, ఇది అండాశయాలను దెబ్బతీయొచ్చు, ఫెలోపియన్ గొట్టాలు మూసుకునేలా చేయొచ్చని వివరిస్తున్నారు. కొందరిలో కడుపులో వచ్చే క్షయ, కటిభాగంలో వచ్చే ఇతరత్రా సమస్యలూ గర్భధారణకు ఇబ్బంది కలిగించొచ్చని, మరికొందరిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు ఉండొచ్చని పేర్కొంటున్నారు.

ఐ వి ఎఫ్ అంటే ఏమిటి?

ఐ వి ఎఫ్ (IVF) అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అని అర్థం. ఇది ఒక సంతానోత్పత్తి చికిత్స, దీనిలో అండాశయాల నుండి గుడ్లను సేకరించి, ప్రయోగశాలలో స్పెర్మ్‌తో ఫలదీకరణం చేసి, ఏర్పడిన పిండాన్ని గర్భాశయంలోకి తిరిగి ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ సంతానలేమితో బాధపడుతున్న జంటలకు సహాయపడుతుంది. 

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870