మద్యం (Alcohol) ఆరోగ్యానికి ప్రమాదకరమని మనందరికి తెలుసు. కానీ, చాలా మంది అలవాటు మానలేరు. అయితే కేవలం ఆరు నెలల పాటు (For six months) మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటే శరీరం నుంచి మనసు వరకు ఎన్నో పాజిటివ్ మార్పులు సంభవిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

- కాలేయం ఊపిరిపీల్చుకుంటుంది
మద్యం వల్ల మొదటుగా ప్రభావితమయ్యేది కాలేయం. ఇది ఆల్కహాల్‌ను శుద్ధి చేయాల్సి వస్తుంది. ఆరు నెలల పాటు మద్యం మానితే కాలేయం తిరిగి ఆరోగ్యంగా మారుతుంది. కాలేయ ఎంజైమ్‌లు కూడా స్థిర స్థాయికి చేరతాయి. - నిద్ర నాణ్యత మెరుగవుతుంది
చాలామందికి మద్యం తాగితే నిద్ర బాగా వస్తుందనే అభిప్రాయం ఉంటుంది. కానీ నిజానికి అది నిద్రను విఘటింపజేస్తుంది. మద్యాన్ని మానేసిన కొన్ని వారాల్లోనే గాఢమైన నిద్రను అనుభవించవచ్చు. - బరువు తగ్గడం ప్రారంభమవుతుంది
ఆల్కహాల్‌లో అధిక క్యాలరీలు ఉండేలా ఉంటుంది. దాన్ని మానేయడం వల్ల శరీర జీవక్రియ మెరుగై బరువు క్రమంగా తగ్గుతుంది. - మానసిక ప్రశాంతత వెల్లివిరుస్తుంది
మద్యం మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. దీన్ని మానేసిన తర్వాత ఆందోళన, డిప్రెషన్ తగ్గి, మెదడు సంతులితంగా పనిచేస్తుంది. - చర్మం కొత్తగా మెరుస్తుంది
ఆల్కహాల్ వల్ల చర్మం డ్రై అవుతుంది. మొటిమలు, మంట వంటి సమస్యలు వస్తాయి. మద్యాన్ని మానేసిన తర్వాత చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. - రోగనిరోధక శక్తి బలోపేతం
మద్యం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలహీనపడుతుంది. దాన్ని మానేసిన తర్వాత తెల్ల రక్తకణాలు తిరిగి నార్మల్ స్థాయికి చేరి, శరీరం వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడగలదు. - గుండె సమస్యలు తగ్గిపోతాయి
అధిక మద్యం వల్ల రక్తపోటు, గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. మద్యాన్ని మానేసిన తర్వాత హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. - జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది
ఆల్కహాల్ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. మద్యం మానడంతో శరీరం పోషకాలను బాగా గ్రహించగలుగుతుంది
Read Also : Pink Salt : పింక్ సాల్ట్ వాడకంతో కొత్త ఆరోగ్య ముప్పు