हिन्दी | Epaper

Health Tips: బీపీకి కొత్త విప్లవాత్మక చికిత్స: ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ చాలు!

Pooja
Health Tips: బీపీకి కొత్త విప్లవాత్మక చికిత్స: ఆరు నెలలకు ఒక ఇంజెక్షన్ చాలు!

Health Tips: హై బీపీ బాధితులకు రోజూ మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేకుండా, అరేళ్లకు ఒక్కసారి తీసుకునే ప్రత్యేక ఇంజెక్షన్ చికిత్స త్వరలో అందుబాటులోకి రానుంది. siRNA టెక్నాలజీ ఆధారంగా పనిచేసే ఈ ఇంజెక్షన్, రక్తపోటు పెరగడానికి కారణమయ్యే కాలేయంలోని కొన్ని ప్రోటీన్ల ఉత్పత్తిని నిరోధిస్తుంది.

Read Also: Water : నీటితో దీర్ఘకాలిక రోగాలకు చెక్..

Health Tips

ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల ప్రకారం, మందులు తరచూ మర్చిపోయే రోగులకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా మారవచ్చు. అయితే, ఈ కొత్త చికిత్స ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, అలాగే దుష్ప్రభావాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.

భారత్‌లో ప్రస్తుతం 31 కోట్లకు పైగా ప్రజలు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఇంజెక్షన్ చికిత్స విజయవంతంగా అమలులోకి వస్తే, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు తగ్గే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870