జలుబు సమయంలో పిల్లలకు అరటిపండు ఇవ్వవచ్చా? నిపుణుల క్లారిటీ ఇదే
వాతావరణ మార్పులతో పిల్లల్లో జలుబు రావడం చాలా సాధారణ విషయం. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై ఎక్కువ జాగ్రత్తలు(Health Tips) తీసుకుంటారు. ముఖ్యంగా ఎంతటి పండ్లు, ఆహార పదార్థాలు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనే విషయాల్లో పెద్దల నుంచి కూడా రకరకాల సలహాలు వస్తుంటాయి. అందులో చాలా మంది అరటిపండు చలవ చేస్తుందని, జలుబు ఉన్నప్పుడు ఇవ్వకూడదని నమ్ముతారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం మాత్రం దీనికి పూర్తిగా భిన్నం.
Read Also: Telangana: 2.91 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యంతో 26 కొత్త గోదాములు

అరటిపండు నిజంగా జలుబు పెంచుతుందా?
వైద్యుల వివరణ ప్రకారం జలుబు చేసిన పిల్లలకు అరటిపండు ఇవ్వడం ఎలాంటి హానీ చేయదు. పైగా, అరటిపండులో ఉండే విటమిన్ B6, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీర కణాల పునరుద్ధరణకు సహాయపడతాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి పిల్లలకు తగిన శక్తిని అందిస్తాయి. అందువల్ల జలుబు సమయంలో కూడా అరటిపండు పిల్లలకు ఇవ్వడం పూర్తిగా సురక్షితం.
పెరుగుని కూడా అనవసరంగా దూరం పెట్టాల్సిన అవసరం లేదు
జలుబు సమయంలో పెరుగు ఇవ్వకూడదనే అపోహ కూడా చాలామందిలో ఉంది. కానీ డాక్టర్లు చెబుతున్నది వేరే. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర రోగనిరోధక శక్తిలో సుమారు 70% భాగం కడుపు ఆరోగ్యంపై ఆధారపడి ఉండటం వలన పెరుగు పిల్లలకు హానికరం కాదు.
ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి
- అరటిపండు కానీ, పెరుగు కానీ ఎప్పుడూ చల్లగా ఇవ్వకూడదు.
- ఫ్రిజ్‌లో ఉంచిన వెంటనే ఇచ్చితే గొంతు నొప్పి, దగ్గు మరింత పెరిగే అవకాశం ఉంది.
- గది ఉష్ణోగ్రతలో ఉన్న ఆహారం మాత్రమే ఇవ్వాలి.
సరైన పద్ధతిలో ఇస్తే అరటిపండు, పెరుగు రెండూ పిల్లల రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఉపయోగకరమే.
గమనిక
ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో లభ్యమయ్యే సమాచారాన్ని ఆధారంగా అందించబడింది. ఆరోగ్య సమస్యలపై తుది నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: