శీతాకాలం వస్తే శరీర రోగనిరోధక శక్తి తగ్గి, జలుబు, (cold) దగ్గు, అలసట వంటి సమస్యలు సాధారణం అవుతాయి. ఈ సమయంలో శరీరానికి అవసరమైన ఐరన్, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. నిపుణుల సూచనల ప్రకారం, చలికాలంలో ఈ కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి.
Read also: Blue berries: చిన్న పండులో మహా ఆరోగ్య రహస్యం

Health: చలికాలంలో తినాల్సిన కూరగాయలు ఇవే!
పాలకూర (Spinach)
పాలకూరలో విటమిన్ కె, విటమిన్ ఎ, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి, శరీరానికి అవసరమైన ముఖ్య పోషకాలను అందిస్తాయి.
మెంతి ఆకులు (Fenugreek Leaves)
మెంతి ఆకులు ఐరన్‌తో పాటు ఫోలేట్, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బీట్‌రూట్ (Beetroot)
బీట్‌రూట్ రక్తహీనత తగ్గించడంలో అద్భుతమైన సహాయకారి. ఇందులో ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అయితే ఇది శరీరాన్ని చల్లబరిచే ప్రభావం కలిగి ఉండటంతో, శీతాకాలంలో మితంగా తీసుకోవడం మంచిది.
బ్రోకలీ (Broccoli)
బ్రోకలీలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, ఎముకలు మరియు చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా డైట్ మార్పులు చేసేముందు వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: