కిడ్నీల్లో రాళ్లు (kedney stones) ఏర్పడటం అనేది చాలా మందికి సాధారణంగా కనిపించే, కానీ తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఇవి చిన్నవిగా మొదలై, పెద్దవిగా మారి మూత్ర నాళాలను అడ్డుకుంటాయి. దీంతో తీవ్రమైన నొప్పి, మూత్రం సమయంలో మంట, మూత్రంలో రక్తం, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమయానికి చికిత్స తీసుకోకపోతే కిడ్నీల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది.
Read also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా?

కిడ్నీల్లో రాళ్లు ఎందుకు వస్తాయి?
డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం, రాళ్లకు మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి:
- తగినంత నీరు తాగకపోవడం: తక్కువ నీరు తీసుకోవడం వల్ల మూత్రం చిక్కబడుతుంది. దీని వలన ఖనిజాలు సులభంగా పేరుకుపోయి రాళ్లుగా మారతాయి.
- అధిక ఉప్పు ఆహారం: ఉప్పు ఎక్కువగా తీసుకుంటే సోడియం పెరిగి, శరీరం నుంచి ఎక్కువ కాల్షియం బయటకు వెళ్తుంది. దీని వలన కాల్షియం స్ఫటికాలు ఏర్పడతాయి.
- ఖనిజాల అసమతుల్యత: కొంతమంది శరీరాలు సహజంగానే అధిక ఆక్సలేట్ లేదా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేస్తాయి, ఇవి రాళ్లుగా పేరుకుపోతాయి.
ఇతర కారణాల్లో కుటుంబ చరిత్ర, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, ప్రాసెస్ చేసిన ఆహారం, టీ–కాఫీ, తీపి పదార్థాల అధిక వాడకం కూడా ఉన్నాయి.
నివారణ మార్గాలు
- రోజూ 8–9 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలి.
- ఉప్పు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాడకాన్ని తగ్గించాలి.
- ఆక్సలేట్ ఉన్న ఆహారం (ఉదా: పాలకూర, చాక్లెట్) మితంగా తినాలి.
- డాక్టర్ సూచించిన విధంగా కాల్షియం తీసుకోవాలి.
- మూత్రాన్ని బిగపట్టి ఉంచకూడదు.
- యూరిక్ యాసిడ్, ఖనిజ స్థాయిలను పర్యవేక్షించాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: