Health: డాక్టర్ నీతి కౌతిష్: కాలుష్యం, వేడి వల్ల మగవారికి పెరుగుతున్న ముప్పు – నిపుణుల హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, కాలుష్యం పెరుగుతుండటంతో మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్న అంశం పురుషుల సంతానోత్పత్తి (Human Reproductive System) సామర్థ్యం తగ్గిపోవడం. ఫరీదాబాద్‌లోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ నీతి కౌతిష్ మాట్లాడుతూ, “పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోవడం కేవలం వ్యక్తిగత సమస్య కాదు, ఇది పర్యావరణ ఆరోగ్యానికి సంకేతం” అని పేర్కొన్నారు.
Read also: Breakfast: అల్పాహారం తినకపోయినా పరవలేదా?

Health: కాలుష్యం, వేడితో మగాళ్లలో పెను ముప్పు..
ఆమె వివరించిన ప్రకారం, గాలిలో ఉన్న సూక్ష్మ ధూళికణాలు (PM 2.5), విష వాయువులు వీర్య కణాల నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఇవి శరీరంలోకి చేరిన తర్వాత ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వల్ల డీఎన్ఏ నష్టానికి దారితీస్తుంది. ఇది హార్మోన్ల పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. 2022లో ‘ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్’ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, అధిక కాలుష్య ప్రాంతాల్లో నివసించే పురుషుల్లో వీర్య కణాల చలనం గణనీయంగా తగ్గినట్లు తేలింది.
Health: అధిక ఉష్ణోగ్రతలు కూడా మరో కీలక కారణమని నిపుణులు అంటున్నారు. వృషణాలు సాధారణంగా శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువ ఉష్ణోగ్రత వద్దనే సరిగ్గా పనిచేస్తాయి. కానీ వేడి వాతావరణంలో పనిచేయడం, బిగుతైన దుస్తులు ధరించడం, వడగాలుల ప్రభావం వంటి కారణాలు వీర్య కణాల ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. ‘జర్నల్ ఆఫ్ థర్మల్ బయాలజీ’లోని అధ్యయనాల ప్రకారం, వృషణాల ఉష్ణోగ్రత 1°C పెరిగినా వీర్య కణాల ఉత్పత్తి 40% వరకు తగ్గుతుంది.
డాక్టర్ కౌతిష్ చెబుతున్నట్లు, కాలుష్యం, వేడి రెండూ కలిసి డబుల్ అటాక్ లా పని చేస్తున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్వహించిన తాజా అధ్యయనంలో, కాలుష్య ప్రాంతాల్లో నివసించే పురుషుల వీర్య కణాల డీఎన్ఏ దెబ్బతినడం, హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- వేడి వాతావరణంలో ఎక్కువ సేపు ఉండకూడదు.
- వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.
- శరీరానికి తగినంత నీరు అందించాలి.
- ధూమపానం, మద్యపానం దూరంగా ఉంచాలి.
- పండ్లు, కూరగాయలు, నట్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉన్న ఆహారం తీసుకోవాలి.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, నగరాల్లో వేడి నియంత్రణ చర్యలు చేపట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సంతానోత్పత్తి ఆరోగ్యం అనేది కేవలం వైద్య అంశం మాత్రమే కాకుండా పర్యావరణ పరిరక్షణతో కూడుకున్న అంశమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: