మన వంటింట్లో లభించే సుగంధ ద్రవ్యాలు రుచి మాత్రమే కాదు, కొన్ని చర్మానికి మేలు (skin care) చేసే గుణాలు కూడా కలిగి ఉంటాయి. అయితే, వాటిని నేరుగా ముఖంపై రాయడం ప్రతిసారీ ప్రయోజనం ఇవ్వదు. సరైన విధంగా ఉపయోగించకపోతే చర్మంపై దద్దుర్లు, ఎర్రబారడం, దురద, అలెర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఇంట్లో ఫేస్‌ప్యాక్‌లు చేసుకునే వారు ముందుగా ఏ సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలో తెలుసుకోవడం చాలా అవసరం.
Read also: Sesame Seeds: తెలుపు వర్సెస్ నల్ల నువ్వులు!

Are you using these spices for facial beauty?
దాల్చిన చెక్క
దాల్చిన చెక్కను యాంటీబ్యాక్టీరియల్ గుణాల కోసం చాలామంది ముఖానికి వాడుతారు. కానీ దీని ఉష్ణ గుణాలు చర్మాన్ని రెచ్చగొట్టి, ఎర్రబారడం, మండుట, వాపు వంటి సమస్యలకు కారణమవుతాయి. ముఖ్యంగా సున్నితమైన స్కిన్ ఉన్నవారు దాల్చిన చెక్కను ముఖానికి రాయకపోవడం మంచిది.
లవంగాలు
లవంగాల నూనె మొటిమల కోసం ఉపయోగిస్తారు కానీ నేరుగా చర్మంపై రాస్తే కాలిన భావన, బొబ్బలు, రాపిడి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి లవంగాల నూనెను కొబ్బరి నూనె లేదా కలబంద జెల్ వంటి క్యారియర్ ఆయిల్‌తో కలిపి మాత్రమే రాయాలి.
ఇంగువ (ఆసాఫోటిడా)
ఇంగువలో వాపును తగ్గించే లక్షణాలు ఉన్నాయి కానీ ముఖానికి రాయడం వల్ల చాలా మందికి దురద, ఎర్రబారడం, అలెర్జీ వంటి సమస్యలు ఎదురవుతాయి. ప్రత్యేకంగా డ్రై మరియు సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు దీనిని తప్పించుకోవడం ఉత్తమం.
ఆవాల పొడి
ఆవాల పొడిలో విటమిన్ E ఉన్నా, నేరుగా ముఖానికి రాస్తే దద్దుర్లు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో ఫేస్‌ప్యాక్‌లో కలపాలంటే చాలా చిన్న పరిమాణంలో మాత్రమే ఉపయోగించాలి. రాయక ముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: