నానబెట్టిన మెంతులు (fenugreek) ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ A, B, C, K తో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఉదయం నానబెట్టిన మెంతులను ఖాళీ కడుపుతో తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే శరీరంలో మలినాలను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
Read also: Tamarind Seeds : చింత గింజలతో ఎన్నో అద్భుతమైన లాభాలు

Health: నానబెట్టిన మెంతుల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు
బరువు నియంత్రణకు
నిత్య జీవితంలో వీటిని అలవాటుగా తీసుకోవడం బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు లేదా బీపీ మందులు వాడేవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే వీటిని తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా వైద్య సూచనలతో పరిమిత మోతాదులో మాత్రమే మెంతులు ఉపయోగించడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: