జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో నువ్వుల నూనె కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉన్న ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, పొడిబారడాన్ని నివారించి, జుట్టు ఒత్తుగా,(Hairgrowth Tips) దట్టంగా పెరిగేలా సహాయపడతాయి.
Read Also: Paracetamol: గర్భిణులు పారాసిటమాల్ వాడొచ్చా?

నల్లగా, మెరిసే జుట్టుకు పోషకాల శక్తి
నువ్వుల నూనెలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుకు(Hairgrowth Tips) పోషణ అందించి, నల్లటి మెరుపును తీసుకొస్తాయి. నిరంతరం మసాజ్ చేస్తే స్కాల్ప్‌లో రక్త ప్రసరణ మెరుగై, జుట్టు రూట్లను బలపరుస్తుంది.
చుండ్రు, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు సహజ చికిత్స
నువ్వుల నూనెకు ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు చుండ్రును తగ్గించడంలో, స్కాల్ప్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వింటర్, సమ్మర్ రెండు సీజన్లలోనూ ఇది స్కాల్ప్‌ను మాయిశ్చర్‌తో నింపి, ఇచింగ్, ఇర్రిటేషన్ తగ్గిస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: