ప్రస్తుత కాలంలో ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి జీవితంలో కీలక అంశంగా మారింది. పర్యావరణ కాలుష్యం, కలుషిత ఆహార పదార్థాలు, రసాయన ఎరువుల వాడకం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మనం రోజూ వినియోగించే బియ్యం, కూరగాయలు, పండ్లను ఎక్కువగా రసాయనిక ఎరువులు, పురుగుమందులతో పండించడంతో అనేక ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, విషతుల్యాలు వాటిలో మిగిలిపోతున్నాయి. వీటిని శుభ్రపరచడంలో వేడి నీరు కీలక పాత్ర పోషిస్తుంది.

వేడి నీటితో కూరగాయలు, పండ్లను కడగడం వల్ల వాటిలోని హానికర బ్యాక్టీరియాలు, కీటకనాశక అవశేషాలు తొలగిపోతాయి. అంతేకాక, వేడి నీరు తాగడం వల్ల మన ఆరోగ్యంపై అనేక విధాలుగా అనుకూల ప్రభావం కలుగుతుంది. ఉదాహరణకు జీర్ణక్రియ మెరుగవుతుంది, చర్మ సమస్యలు తగ్గుతాయి, శరీరంలో టాక్సిన్లు తొలగిపోతాయి, వాయువు, అలసట, ఒత్తిడి తగ్గుతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలోనూ సహాయపడుతుంది. ఈ కారణంగా చాలా మంది వేడి నీటిని శాశ్వతంగా తమ జీవనశైలిలో భాగం చేసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో ఎలక్ట్రిక్ కెటిల్స్ వినియోగం గణనీయంగా పెరిగింది.
ఎలక్ట్రిక్ కెటిల్ – సమర్థవంతమైన, సురక్షితమైన పరిష్కారం
ఎలక్ట్రిక్ కెటిల్స్ సహాయంతో వేడి నీటిని చాలా తక్కువ సమయంలో సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. ఇవి కేవలం నీరు మరిగించడానికే కాకుండా, టీ, కాఫీ, సూప్, న్యూడుల్స్ వంటి వేడి పదార్థాలు తయారు చేసుకోవడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. ప్రధానంగా వాటిలో కనిపించే ఫీచర్లు
- ఆటో కట్ ఆఫ్ సిస్టమ్
- బాయిల్ డ్రై ప్రొటెక్షన్
- స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ
- వేడి నిరోధక హ్యాండిల్స్
- వెరి ఫాస్ట్ హీటింగ్ సిస్టమ్
- ఇంధన పొదుపు
- పోర్టబుల్ డిజైన్
ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ కెటిల్స్ గురించి చూద్దాం.

విప్రో ఎలాటో బీకే 215 కూల్ టచ్ కెటిల్
ఈ కెటిల్ భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ట్రిపుల్ లేయర్ టెక్నాలజీతో రూపొందించబడింది. యాంటీ రస్ట్ షీల్డ్, సూపర్ ఫాస్ట్ హీటింగ్, ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్, రెండేళ్ల వారంటీ
ధర: ₹1,899 (అమెజాన్ లో) అందుబాటులో ఉంది.
ఫిలిప్స్ హెచ్ డీ 93632 కెటిల్
స్టెయిన్ లెస్ స్టీల్ బాడీతో కూల్ టచ్ హ్యాండిల్, మూతతో దీన్ని వినియోగించడం చాలా సులభం. టీ, కాఫీ, ఇతర వేడి పానీయాల కోసం నీటిని త్వరగా మరిగిస్తుంది. ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఫీచర్ తో నీరు మరిగిన తర్వాత దానికదే ఆగిపోతుంది. సింగిల్ టచ్ లిడ్ లాకింగ్ తో ఎలాంటి ఇబ్బంది లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ కెటిల్ ను అమెజాన్ లో రూ.1,949కి కొనుగోలు చేయవచ్చు.
పీజియన్ బై స్టోవ్ క్రాఫ్ట్ హాట్ ప్లస్ ఎలక్ట్రిక్ కెటిల్
క్లాసిక్ మ్యాట్ ఫినిషింగ్ తో డిజైన్ చాాలా బాగుంది. ముఖ్యంగా 1500 వాట్స్ హీటింగ్ ఎలిమెంట్ తో కేవలం ఐదు నుంచి ఏడు నిమిషాల్లో నీటిని మరిగిస్తుంది. టీ, కాఫీ, ఇన్ స్టంట్ న్యూడుల్స్, సూప్ తదితర వాటిని తయారు చేసుకోవచ్చు. వినియోగం తర్వాత చాాలా తేలికగా శుభ్రం చేసుకోవచ్చు. అమెజాన్ లో దీని ధర రూ.549 మాత్రమే.హాఫెల్ డోమ్ ప్లస్

హాఫెల్ డోమ్ ప్లస్ ఎలక్ట్రిక్ కెటిల్
ఆకట్టుకునే డిజైన్, మంచి నాణ్యతతో పాటు భద్రతకు ప్రాధాన్యమిచ్చారు. దీనిలోని యూకే స్ట్రిక్స్ కంట్రోల్ థర్మోస్టాట్ ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రణ చేస్తుంది. అనలాగ్ డిస్ ప్లే, ఎల్ఈడీ సూచిక లైట్, బాయిల్ డ్రై రక్షణ, మైక్రో మెస్ ఫిల్టర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.అమెజాన్ లో ఈ కేటిల్ రూ.3,980కి అందుబాటులో ఉంది.
ఫిలిప్స్ డబుల్ వాల్ట్ కెటిల్
రోజు వారీ అవసరాల కోసం నీటిని మరిగించుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనిలోని ప్రత్యేక టెక్నాలజీ నీటిని ఎక్కువ సేపు వేడిగా ఉంచేలా చేస్తుంది. 6ఏ చిన్న ఫ్లగ్ తో 1.5 లీటర్ల సామర్థ్యం, ఆటోషట్ ఆఫ్ ఫంక్షన్, రెండేళ్ల వారంటీ తదితర ప్రత్యేకతలతో తీసుకువచ్చారు. ఈ కెటిల్ ను రూ.2,549కు అమెజాన్ లో కొనుగోలు చేయవచ్చు.
Read also: Milk rice: మిల్క్ రైస్ లో బోలెడన్ని పోషకాలు