గుడ్డు అనేది పోషక విలువల పరంగా అద్భుతమైన ఆహారం. ఇందులో పుష్కలంగా ఉండే ప్రోటీన్, బీ కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ డీ, ఐరన్, జింక్, సెలెనియం లాంటి ఖనిజాలు దాన్ని “సూపర్ ఫుడ్” స్థాయికి తీసుకెళ్తాయి. కానీ ఈ గుడ్డు శాఖాహారం కాదా? మాంసాహారమా? అనే ప్రశ్న మాత్రం తరచూ వస్తూ ఉంటుంది.

శాస్త్రీయ నిర్వచనం ఏమిటి?
శాస్త్రీయంగా పరిశీలించినప్పుడు, శాకాహారం అంటే — జంతువులను చంపకుండా తీసుకునే ఆహారం అని నిర్వచించబడుతుంది. దాని ప్రకారం ఈ కోణంలో చూస్తే గుడ్డు శాఖాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో-వెజిటేరియన్స్ అంటారు. సైన్స్‌ను పక్కనపెడితే భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగా పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం నుంచి చూస్తే గుడ్లు 2 రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించే గుడ్లు. అంటే వీటి నుంచి కోడి పల్లలు బయటికిరావు.
గుడ్లు రెండు రకాలన్నది మీకు తెలుసా?
ఫలదీకరణం గుడ్లు (Fertilized Eggs) – ఇవి కోడి మరియు కోడి పుంజు మధ్య పునరుత్పత్తి చర్య ఫలితంగా ఉత్పన్నమయ్యే గుడ్లు. వీటిలో నుంచి కోడి పిల్లలు బయటకు రావొచ్చు.
ఫలదీకరణం చేయని గుడ్లు (Unfertilized Eggs) – ఇవి కోడి పుంజు లేకుండానే ఉత్పత్తి అవుతాయి. ఇవి తినే గుడ్లుగా మార్కెట్‌లో లభ్యమవుతాయి. ఇవి అసలు కోడి పిల్లగా మారే అవకాశం లేదు. మార్కెట్‌లో దొరుకే 99% గుడ్లు ఈ రెండో రకానికి చెందినవే. కాబట్టి ఇవి శాకాహారంగా పరిగణించవచ్చు.

కోడి పెట్ట, కోడి పుంజుల పునరుత్పత్తి చర్య వల్ల పెట్టిన కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు సహకారంలేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అంటారు. గుడ్డులోపల కోడి పిల్ల అభివృద్ధి చెందని గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డను శాఖాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు.
అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ప్రభావం వల్లనే గుడ్డులో రక్తం చుక్కలు కనిపిస్తాయి.
- గుడ్డు తినడం వల్ల ప్రోటీన్, విటమిన్ B12, ఐరన్, చక్కటి కొవ్వు లాంటి పోషకాల లాభం కలుగుతుంది.
- గుండె ఆరోగ్యం, కండరాల అభివృద్ధి, మెదడు ఆరోగ్యం వంటి వాటికి మేలు చేస్తుంది.
- రోజుకి ఒక గుడ్డు (లేదా రెండు) తినడం ఆరోగ్యకరమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
శాస్త్రీయంగా చూస్తే గుడ్డు శాకాహారమే. కానీ సాంప్రదాయ, మతపరమైన కోణంలో అది మాంసాహారంగా పరిగణించబడుతుంది.