2019 నుంచే ఈ-సిగరెట్లు, E-cigarettes వేపింగ్ పరికరాలపై నిషేధం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈ-మత్తు ఉత్పత్తుల వ్యాపారం గుట్టుగా కొనసాగుతోంది. అధిక ధరలకు వీటిని విక్రయిస్తున్న వ్యాపారులపై నిఘా బలపరుస్తామని అధికారులు చెబుతున్నారు. గంజాయి (Drug) వినియోగం పెరుగుతుండగా, ఇప్పుడు టీనేజర్లు ఈ-మత్తు పరికరాలపై ఆకర్షితులవుతున్నారు. తాము కేవలం ఫ్యాషన్‌గా మొదలుపెట్టిన అలవాటు, కొంత కాలంలోనే వ్యసనంగా మారుతోంది.
Water:నీళ్లు మంచిదే కానీ మోతాదుకు మించరాదు
వైద్యుల హెచ్చరికలను పట్టించుకోవడంలేదు

E-cigarettes
నిజామాబాద్ జిల్లా పరిధిలో 18–35 ఏళ్ల వయస్సు గల యువతలో చాలా మంది ఒత్తిడి, నిరాశలతో ఈ-సిగరెట్లు, వేపింగ్ మిషన్లకు బానిసలవుతున్నారు. చేతిలో సులభంగా దాచిపెట్టుకునే ఈ పరికరాల వలన ఊపిరితిత్తుల (Lung) సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వేప్ లిక్విడ్స్‌లో నికోటిన్‌తో పాటు శరీరానికి హానికరమైన రసాయనాలు అధిక మోతాదులో ఉన్నాయని వారు వెల్లడించారు.
అధికారుల చర్యలు
పోలీసులు ఇటీవల జిల్లాలోని పాన్ షాపులు, టీ షాపులపై తనిఖీలు ప్రారంభించారు. నిషేధిత ఈ-ఉత్పత్తులను విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్ర, Maharashtra గోవా వంటి రాష్ట్రాల నుంచి ఈ సరుకు రాకుండా నిఘా బలపరచాలని సూచించారు.
యువతకు అవగాహన అత్యవసరం
“ఈ-సిగరెట్ల E-cigarettes విక్రయం, వినియోగం నిషేధితమే. యువత మత్తు పదార్థాల అనర్థాలను గుర్తించి దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై దృష్టి ఉంచాలి” అని అధికారులు తెలిపారు.
గుర్తించలేని మత్తు
సాధారణ సిగరెట్ల sigarette మాదిరిగా పొగ లేదా వాసన రాకపోవడంతో తల్లిదండ్రులు పిల్లలు ఈ అలవాటులో ఉన్నారనే విషయం గుర్తించలేకపోతున్నారు. కొన్ని పాన్ షాపులు, కిరాణా దుకాణాలు గుట్టుగా ఈ-ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని సమాచారం. విదేశాల నుంచి వచ్చే కొందరు వ్యక్తులు కూడా వీటిని తెచ్చి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, పాఠశాలలు, పోలీసు శాఖ కలిసి యువతలో అవగాహన పెంచకపోతే ఈ ‘ఇ-వ్యసనం’ ఒక పెద్ద సామాజిక ముప్పుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ-సిగరెట్లు నిషేధం ఎప్పటి నుంచి అమల్లో ఉంది?
2019 నుంచి దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లు, వేపింగ్ పరికరాలపై నిషేధం ఉంది.
యువతలో ఈ వ్యసనం ఎందుకు పెరుగుతోంది?
ఒత్తిడి, మానసిక ఆందోళన, కొత్త అనుభవాల పట్ల ఆకర్షణ వల్ల.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: