బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడం చట్టపరంగా తప్పనిసరి. రోడ్డు ప్రమాదంలో ఇది మీ ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. అయితే, హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు పాడవుతుందని లేదా ఊడిపోతుందని చాలామంది భావిస్తున్నారు. బిగుతుగా ఉండే హెల్మెట్లు, జుట్టు కుదుర్లపై ఒత్తిడిని పెంచుతున్నాయని, దీనివల్ల చెమట పెరిగి, జుట్టు బలహీనపడుతుందని కొందరు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోకపోవడానికి ట్రాఫిక్ పోలీసులు కారణాలు అడిగినప్పుడు, జుట్టు రాలిపోతుందని పెట్టుకోవడం లేదని కొందరు సమాధానాలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. హెల్మెట్ కొన్నిసార్లు తలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీనివల్ల, చెమట పేరుకుపోతుంది. ఇది వెంట్రుకలకు సమీపంలోని చర్మాన్ని లేదా నెత్తిని ప్రభావితం చేస్తుంది. హెల్మెట్ లోపల మురికి పేరుకుపోయినా లేదా బిగుతుగా ఉన్నా లేదా బూజు పట్టినా అది మీ జుట్టును ప్రభావితం చేస్తుంది. అయితే, జుట్టు ఊడిపోవడానికి హెల్మెట్లు ఒక్కటే కారణం కాదు.
Read Also:Tomiichi Murayama: 101 ఏళ్ల జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

తరచూ జుట్టును వాష్ వల్ల జుట్టుకు డ్యామేజ్
తరచూ జుట్టును వాష్ చేసుకోవడం, హెల్మెట్‌ను శుభ్రపరుచుకోవడం వల్ల జుట్టుకు డ్యామేజ్‌ను తగ్గించవచ్చు. హార్మోన్ల మార్పులు, జెనెటిక్స్, జీవనశైలి కూడా జుట్టు ఊడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇవేమీ కాకుండా కేవలం హెల్మెట్ల వల్లనే జుట్టు ఊడిపోతుందనడానికి కచ్చితమైన ఆధారాలులేవని తెలిసింది. చిన్న వయసులో జుట్టు రాలడమన్నది అరుదైన సంఘటన కాదు. దీని వెనకాల చాలా కారణాలున్నాయి. వాటిని గుర్తించడం చాలా ముఖ్యం. ”హార్మోన్ మార్పులు వంటి హార్మోన్ల అంశాలు జట్టు ఊడిపోవడానికి ప్రధాన కారకం. మహిళల్లో థైరాయిడ్, పీసీఓడీ వంటివి కూడా జట్టు రాలడానికి కారణమవుతున్నాయి.
హెల్మెట్ వల్ల కుదుర్లలో దురద, చెమట, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు
”బిగుతుగా ఉండే హెల్మెట్‌ను పెట్టుకోవడం వల్ల జుట్టు కుదుర్లపై ప్రభావం పడుతుంది. సరైన హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల కుదుర్లలో దురద, చెమట, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. హెల్మెట్ సైజు సరిగ్గా లేకపోయినా, లోపల సరిగ్గా శుభ్రపరచకపోయినా ఈ సమస్య మరింత పెరుగుతుంది” అని ముంబయికి చెందిన డెర్మటాలజిస్ట్ చెప్పారు. ”పోనీటెయిల్ మాదిరి హెయిర్‌స్టయిల్‌తో హెల్మెట్ పెట్టుకుంటే, అది కుదుర్ల దగ్గర జుట్టును గట్టిగా లాగేస్తుంది. ఇది కుదుర్లపై ఒత్తిడికి దారితీస్తుంది.
హెల్మెట్లు మాత్రమే జుట్టు రాలడానికి కారణం కాదు
సరైన హెల్మెట్ వాడకపోవడం వల్ల కూడా జుట్టు ఊడే సమస్య రావొచ్చు. ఒత్తిడి, చెమట వంటి వాటివల్ల జుట్టు ఊడిపోతుంది. మీ స్కిన్‌ను జాగ్రత్తగా చూసుకుంటూ, గ్రంథులు దెబ్బతినకుండా ఉంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది. చాలాకాలంగా జుట్టు ఊడుతూ ఉంటే, దీని వెనక మరేదైనా కారణం ఉందేమో చెక్ చేసుకునేందుకు వైద్యుణ్ని సంప్రదించాలి” హెల్మెట్ మానేయడం వల్ల సమస్య పరిష్కారం కాదన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: