हिन्दी | Epaper

దీనిని ఆహారంలో తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Ramya
దీనిని ఆహారంలో తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నొప్పులు, వాపులు, జీర్ణ సమస్యలు ఇలా రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఒక మంచి అద్భుతమైన పదార్థం. మీ ఆరోగ్యాన్ని పెంచడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. ప్రస్తుతం తెలుసుకుందాం. అనారోగ్యంతో బాధపడేవారు ఆహారంలో కొంచెం ఇంగువను చేర్చుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంగువ ఆహారం రుచిని బాగా పెంచుతుంది. శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ఇంగువ అనేక అద్భుత గుణాలున్న ఆయుర్వేద మొక్క నుండి తయారు చేస్తారు. ఫెరులా అని పిలిచే మొక్క కాండం, వేర్ల నుంచి వచ్చే రసంతో ఇంగువను తయారు చేస్తారు.

 దీనిని ఆహారంలో తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

నొప్పులు మరియు వాపులు తగ్గించడం

ఇంగువలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులు, వాపులు తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ పదార్థం మన శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంతో, వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో కూడా దోహదం చేస్తుంది. ఇవి మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల శరీరకణాలకు కలిగే నష్టం నుండి మనలను కాపాడతాయి.

జీర్ణ వ్యవస్థకు సహాయం

ఇంగువ పేగు కండరాలను బలోపేతం చేయడంలో, గ్యాస్, కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరచడం ద్వారా మన శరీరానికి కావలసిన పోషకాల సమర్థమైన శోషణలో సహాయపడుతుంది. నీటిలో ఇంగువను కరిగించి తీసుకొంటే మైగ్రియిన్లు, తలనొప్పులను తగ్గిస్తుంది.

శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం

ఇంగువను శ్వాసకోశ సమస్యలకి సహజమైన చికిత్సగా ఉపయోగిస్తారు. అస్తమా, బ్రాంకైటిస్, దగ్గు వంటి సమస్యలను తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. గోరువెచ్చని నీటితో తీసుకున్న ఇంగువ శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. ప్రతిరోజు మనం ఇంగువను తీసుకుంటే అది మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం

ప్రతిరోజూ ఇంగువను తీసుకోవడం ద్వారా మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. ఇంగువలో ఉన్న యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు, శరీరంలో ఉన్న విషములు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఎంతో సహాయపడతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. చర్మ సంరక్షణ ఉత్పత్తులలో సమర్థవంతమైన చికిత్స కోసం ఔషధ లక్షణాలున్న ఇంగువను వాడటం మంచిది. ఇంగువలో రోగ నిరోధక శక్తి ఉంది. గాయాలు, చర్మ వ్యాధులకు ఇంగువ సమర్ధవంతంగా పనిచేస్తుంది.

మహిళల ఆరోగ్య ప్రయోజనాలు

ఇంగువ నెలసరి సమయంలో మహిళలకు అసౌకర్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పదార్థంలో ఉన్న యాంటీ స్పాస్మోడిక్ లక్షణాలు గర్భాశయ కండరాలను బలోపేతం చేస్తాయి, దీంతో మహిళలు అనుభవించే నొప్పులు, వాపులు తగ్గుతాయి.

ఇంగువను ఎలా ఉపయోగించాలి?

ఇంగువను ఆహారంలో చేర్చడం లేదా గోరువెచ్చని నీటితో తీసుకోవడం ద్వారా మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనిని పదార్థంగా ఉపయోగించి, రోజూ మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల పరిష్కారం సులభం అవుతుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

మన వంటగదే ఒక హాస్పిటల్.. ఈ చిట్కాలతో ఆరోగ్యం మీ గుప్పిట్లో!

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

డయాబెటిస్ రోగులకు తీపి కబురు

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

భోజనం తర్వాత వెంటనే టీ తాగుతున్నారా?

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

నిద్రపై మొబైల్ ఫోన్ల ప్రభావం

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

పురుషుల్లో పెరుగుతున్న జుట్టు రాలడం: కారణం మీ జీర్ణ వ్యవస్థేనా?

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

వైద్య పరికరాల రంగంలో స్వదేశీ విప్లవం

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

శరీరంలో విటమిన్ బి12 పెంచుకునే సహజ మార్గాలు!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

మీ కళ్లు ఇలా ఉన్నాయా? అయితే ఆ పార్ట్ డ్యామేజ్‌ అయినట్లే!

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పదార్థాలు అస్సలు తినకండి

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

గింజలు చిన్నవే.. కానీ, లాభాలు మాత్రం బోలెడు

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

15 రోజులు వెల్లుల్లిని ఇలా తింటే శరీరంలో వచ్చే మార్పులు ఇవే..

📢 For Advertisement Booking: 98481 12870