యూకేలోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంటి ఎనామిల్‌ను(Dental Care) మళ్లీ పెంచే సామర్థ్యం ఉన్న కొత్త ప్రొటీన్ ఆధారిత జెల్‌ను అభివృద్ధి చేశారు. ఇది దంత వైద్య రంగంలో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. ఈ జెల్‌ను పంటిపై అప్లై చేస్తే, అది సహజ లాలాజలంలోని కాల్షియం, ఫాస్ఫేట్ ఖనిజాలను శోషించుకుని ఎనామిల్‌ను సహజ ప్రక్రియలోనే తిరిగి ఏర్పడేలా చేస్తుంది.

వారం రోజుల్లోనే ఫలితాలు
శాస్త్రవేత్తలు నిర్వహించిన ప్రయోగాల్లో వారం రోజుల్లోనే దంతంలో స్పష్టమైన మార్పు కనిపించినట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఈ జెల్(Dental Care) బ్రషింగ్, నమలడం వంటి రోజువారీ ఒత్తిడిని కూడా తట్టుకునేలా ఉందని నిరూపితమైంది. ఈ కొత్త చికిత్సకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్‌ను 2026లో ప్రారంభించేందుకు పరిశోధకులు సిద్ధమవుతున్నారు. విజయవంతమైతే, భవిష్యత్తులో పంటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా ఇది మారే అవకాశాలు ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: