Dark Chocolate: కోకోను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారి పరిశోధన ప్రకారం, కోకోలో ఉండే ఫ్లావనాల్స్ అనే సహజ సమ్మేళనాలు రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీంతో మెదడుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరా పెరుగుతుందని వారు తెలిపారు.
Read Also:Health Tips: సపోటా పండుతో కిడ్నీ రాళ్లు, బరువు పెరుగుతారా?

ఈ ప్రక్రియ వల్ల మన ఏకాగ్రత పెరగడం, నిర్ణయాలు త్వరగా తీసుకునే సామర్థ్యం మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పరిశోధకులు పేర్కొన్నారు. అంతేకాకుండా మానసిక అలసట కూడా తగ్గి మెదడు మరింత చురుకుగా పనిచేసే అవకాశం ఉంటుందని తెలిపారు. రోజూ మూడు చెంచాల కోకో పౌడర్‌ను పాలు లేదా నీటిలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు కనిపించవచ్చని వారు సూచిస్తున్నారు. కోకో ప్రధాన పదార్థంగా ఉండే డార్క్ చాక్లెట్ లో కూడా ఈ పోషకాలు లభిస్తాయని నిపుణులు చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: