ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడి నీళ్లు (Hot Water) తాగడం వల్ల జీర్ణవ్యవస్థ శక్తివంతంగా పనిచేస్తుంది. ఇది ఆమ్లాల ఉత్పత్తిని సమతుల్యం చేస్తూ, ఆహారం సులభంగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. తరచూ వేడి నీళ్లు తాగడం వల్ల కడుపులో ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. దీనివల్ల శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లి బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
తేనె-నిమ్మ కలిపిన నీటి ప్రయోజనాలు
వేడినీటిలో తేనె లేదా నిమ్మరసం కలిపి తాగితే గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. సైనస్ సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతో ఉపయుక్తంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో, ఇమ్యూనిటీని పెంచడంలో సహకరిస్తుంది. రోజు ప్రారంభంలో ఇలా తీసుకోవడం శరీరానికి తాజాదనం, ఉత్తేజాన్ని ఇస్తుంది.
రక్త ప్రసరణ, చర్మ ఆరోగ్యానికి తోడ్పాటు
వేడి నీళ్లు రక్తనాళాల్లోని మలినాలను బయటకు పంపించడంలో సహాయపడతాయి. దీనివల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మరింత మెరుగవుతుంది. ఇది చర్మానికి కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. టాక్సిన్లు బయటకు పోవడం వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ వేడి నీటిని తాగడం ద్వారా శరీరానికి లోపలినుంచి శుభ్రత చేకూరుతుంది.
Read Also : Srisailam : శ్రీశైలంలో ఉచిత స్పర్శదర్శనం రద్దు