Alcohol: మత్తుపదార్థాలు ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు. కానీ స్నేహితుల ప్రోద్భలమో, అదొక న్యూట్రెండ్ అనుకుని చాలామంది వీటికి బానిసలుగా మారుతున్నారు. మద్యం.. ఈ వ్యసనం వల్ల ఎన్ని కుటుంబాలు పతనమవుతున్నాయో మనకు తెలియనిది కాదు. మద్యం (Alcohol) అమ్మకూడదని, మద్యాన్ని నిషేధించాలని గతంలో మహిళలు ఎన్నో ఉద్యమాలు చేశారు. సంవత్సరాలుగా వీటిని వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎన్నో పోరాటాలు చేశారు. ప్రభుత్వాలు దిగొచ్చి, మద్యాన్ని నిషేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ పక్క రాష్ట్రాల నుంచి చాటుమాటుగా కొనుగోలు చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయం ఇతర రాష్ట్రాలు వెళ్తుండడం, ప్రభుత్వాలకు భారీగా ఆదాయం తగ్గడంతో మద్యాన్ని తిరిగి అమలు చేస్తున్నది.
Read also: Pregnancy:ఆలస్యంగా ప్రెగ్నెన్సీ: ఆరోగ్య రిస్కులు, జుట్టు సమస్యలు.

Alcohol: తాగుడుకు దూరమవుతున్న యువత
Alcohol: లేతవయసులోనే యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారు. జీవితాన్ని చిద్రం చేసుకుంటున్నారు. అంతెందుకు ఇటీవల కర్నూల్ బస్ దగ్ధంలో 19మంది సజీవం సమాధి కావడానికి కారణం ఏమిటి? శివశంకర్ అనే యువకుడు మద్యం సేవించి, ద్విచక్రవాహనం నడిపి, ప్రమాదంలో మరణించారు. రోడ్డుపై బండి అలాగే ఉండిపోయింది. పలు వాహనాలు ఆ బండి చూస్తూ, పక్కనుంచి వెళ్లినా, కావేరీ ట్రావెల్ బస్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బండిని లాక్కుంటూ వెళ్లడం బట్టి, బస్సు కాలిపోయింది. ఎన్నో కుటుంబాలు తాగుడు వల్ల భార్యాబిడ్డలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మారుతున్న యువత అయితే ఒక శుభపరిణామం ఏమిటో తెలుసా? ప్రపంచవ్యాప్తంగా యువతలో, ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్)లో మద్యం తాగే అలవాటు గణనీయంగా తగ్గుతోంది. చట్టబద్ధంగా మద్యం తాగే వయసున్న ప్రతీముగ్గురు యువకుల్లో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు ఆల్కహాల్ తీసుకోలేదని ఓ గ్లోబల్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రముఖ డేటా
అనలిటిక్స్ సంస్థ యూరోమానిటర్ ఇంటర్నేషనల్ విడుదల చేసిన ఈ నివేదిక, మూరుతున్న యువత ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తోంది.
ఇది శుభపరిణామమే
ఆరోగ్య సమస్యలకు దూరంగా.. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎక్కువమంది (87 శాతం) మద్యానికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. డబ్బు ఆదా కూడా ఒక కారణమని (30శాతం), నిద్ర నాణ్యతను మెరుగు పర్చుకోవడం (25శాతం) వంటి కారణాలు కూడా ఈ మార్పునకు దోహదపడుతున్నాయి. 2020లో వారానికి ఒకసారైనా మద్యం తాగేవారు 23శాతం ఉండగా, 2025 నాటికి ఆ సంఖ్య 17 శాతానికి పడిపోయింది. ప్రాచుర్యం పొందుతున్న జీబ్రా స్టెపింగ్ ‘జీబ్రా స్టైపింగ్’ అనే కొత్త ట్రెండ్ యువతలో ప్రాచుర్యం పొందుతోంది. ఒకే చోటు కూర్చున్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరోసారి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడాన్ని ‘జీబ్రా స్టైపింగ్’ అంటారు. విధానం ద్వారా మద్యం వినియోగాన్ని నియంత్రించుకుంటున్నారు. ఏదిఏమైనా ఇది శుభపరిణామమే అని చెప్పాలి. ఎందుకంటే ఒక్క చెడు వ్యసనం జీవితాన్ని, ఆర్థిక వనరులను నాశనం చేస్తుంది. అది ఒక్క కుటుంబానికే కాదు సమాజానికి కూడా కీడు చేస్తుంది అని యువత గుర్తిస్తే అదే పదికోట్లు..
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: