మన శరీరానికి ప్రోటీన్ ఎంతో అవసరం.అధిక ప్రోటీన్ ఉన్న కూరగాయలు మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే కాక, ఆకలిని తగ్గించటంలో కూడా సహాయపడతాయి. రోజూ వంటలో ఉపయోగించే కొన్ని కూరగాయల్లోనే మంచి ప్రోటీన్ ఉంటుంది.ఆహారంలో ఎక్కువ కూరగాయల్ని చేర్చితే ఎక్కువ పోషకాలు, తక్కువ కేలరీలు ఉంటాయి. అందులో భాగంగా బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ, పచ్చి బఠానీలు,కాలీఫ్లవర్ వంటి తక్కువ కేలరీల కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు స్పీడ్‌గా కరిగిపోతుంది. ఇవి ఆకలి హార్మోన్లని కంట్రోల్ చేస్తాయి.
జీర్ణక్రియ
పచ్చి బఠానీని తక్కువుగా అంచనా వేయకండి. ఇవి తేలికగా దొరికే కూరగాయలు. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్‌లు ఉండటం వల్ల శక్తి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.బచ్చలికూరను వండిన తర్వాత తీసుకుంటే శరీరానికి మరింత ప్రోటీన్ లభిస్తుంది. ఇందులో ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది. బచ్చలికూరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా లాభం ఇస్తుంది. బ్రోకలీ జీర్ణక్రియ మెరుగవ్వడానికి సహాయపడుతుంది. శరీరంలోని అనవసర పదార్థాలను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది.కప్పు బ్రోకలీలో సుమారు 4 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది.క్యాబేజీ సులభంగా లభించే కూరగాయ. ఇందులో మంచి విటమిన్‌లు ఉంటాయి. ఇది శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ను ఇస్తుంది. క్యాబేజీతో చేసిన వంటలు తేలికగా జీర్ణం అవుతాయి. ఉడికించి తింటే ఇది శరీరానికి మరింత మేలు చేస్తుంది.

తక్కువ ఖర్చు
సోయాబీన్‌లో ఉన్న ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇస్తుంది. వీటిని ఉడకబెట్టి తినవచ్చు. లేకపోతే పచ్చిగా సలాడ్ రూపంలో తీసుకుంటే ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి తగిన శక్తిని అందిస్తుంది.ప్రోటీన్ కోసం కేవలం మాంసాహారం మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. పై కూరగాయలను వంటలలో చేర్చితే శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. ఇవి తక్కువ ఖర్చుతో లభించడమే కాక, ఆరోగ్యంగా ఉంచుతాయి.ఈ కూరగాయలు తీవ్రమైన అనారోగ్యాల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. సమతుల్య ఆహారాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా, అధిక ఫైబర్ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లను అందిస్తుంది.

జ్ఞాపకశక్తి
కూరగాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే కొన్ని రకాల కూరగాయలు తినడం వలన తక్కువ వ్యవధిలో బరువు అదుపులో వస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి, పదును పెట్టడానికి కూరగాయలు అత్యుత్తమ ఆహారం. అదే సమయంలో ఇది బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

చిట్కా
కాలంతో పోటీ పడుతూ పనులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగం, బాధ్యతలు, విధులు ఇవన్నీ మనిషి జీవితంతో పాటు.. శారీరక, మానసిక పరిస్థితులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వయసుతో సంబంధం లేకుండా బరువు పెరుగుతోంది. దీంతో బరువు తగ్గించే చిట్కాలు ఆరోగ్యకరమైన ఫిట్ బాడీగా ఉంచే ఉత్తమ చిట్కాలు ఉన్నాయి. వీటిల్లో ఒకటి కూరగాయలు. ఇవి ఆరోగ్యకరమైన పోషణను అందిస్తాయి.. కనుక ఇవి తినడానికి ఉత్తమైనవి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read Also :Health: పోషకాల ఘని డ్రాగన్ ఫ్రూట్