సమ్మర్‌లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి. బంగారు ఛాయతో, కమ్మటి వాసనతో ఆకర్షించే పనస తొనలంటే ఇష్టపడనివారుండరు. పండిన పనసే కాదు పచ్చికాయతో కూర, బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పనసపండు టేస్ట్ మాత్రమే కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనసపండులో డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, నియాసిన్, విటమిన్ ఎ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పనసపండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ స్టోరీలో చూద్దాం.పనసపండులో.. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు(Antioxidants)మెండుగా ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్‌ఫెక్షన్లు సోకకుండా శరీరాన్ని రక్షిస్తాయి.వంద గ్రాముల పనస తొనలలో 94 కిలో కేలరీలు , మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయి. పనసపండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చు. పనసపండులోని చక్కెరలు చాలా తేలికగా జీర్ణమవుతాయి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
హైపర్‌టెన్షన్
పనసపండులో పొటాషియం మెండుగా ఉంటుంది. ఇది శరీరంలో సోడియం సమతుల్యను నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే ధమనులు, గుండెకు హాని జరుగుతుంది. పొటాషియం గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పనసపండులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.పనసపండులో యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్‌తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండూ శరీరంలో క్యాన్సర్‌కు(Cancer) కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటో న్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ సమస్యని కూడా దూరం చేస్తుంది.పనసపండులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది, ఇది ఎముకలను బలపరుస్తుంది. దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనసపండు తింటే ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది.

ఇన్ఫెక్షన్
పనసపండు శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ఆస్తమా ఎటాక్స్‌ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కాలుష్యం కారణంగా వచ్చే ఆస్తమా ఎటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా దాడులకు దారితీసే కాలుష్యం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఎఫెక్టివ్‌గా సహాయపడుతుంది.పనసపండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్లను రక్షిస్తుంది. హీనికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. విటమిన్ ఏ యూవీ కిరణాలు, హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్లను కాపాడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
Read Also: Health: ప్రోటీన్ పుష్కలంగా ఉండే కూరగాయలు