గర్భం దాల్చాలని భావిస్తున్న మహిళలు, ఇప్పటికే గర్భవతులైన మహిళలు ఫోలిక్ యాసిడ్‌ను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫోలిక్ యాసిడ్‌ను విటమిన్ B9గా కూడా పిలుస్తారు. ఇది బిడ్డ శరీర నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also: Health: థైరాయిడ్ నియంత్రణకు సరైన డైట్ ఇదే

గర్భధారణ ప్రారంభ దశలో ఫోలిక్ యాసిడ్(Pregnancy Care) తీసుకోవడం వల్ల బిడ్డ న్యూరల్ ట్యూబ్ సరిగ్గా అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల మెదడు, వెన్నుపాము సంబంధిత లోపాల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అలాగే శిశువు ఆరోగ్యంగా ఎదగడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
ఫోలిక్ యాసిడ్ సరిపడా తీసుకుంటే నెలలు నిండకముందే ప్రసవం కావడం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, గర్భస్రావం(Pregnancy Care) వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు గర్భిణుల్లో ప్రీఎక్లాంప్సియా ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్లు, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి కూడా రక్షణ కల్పించడంలో ఇది దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: