చలికాలంలో చర్మం(Natural Care) పొడిబారడంతో పాటు పాదాల వద్ద పగుళ్లు ఏర్పడటం సాధారణ సమస్య. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది నొప్పి, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అయితే సరైన సంరక్షణతో ఈ సమస్యను ఇంటి చిట్కాలతోనే తగ్గించుకోవచ్చు. పల్లీల పొట్టు పొడిని కొద్దిగా తీసుకుని అందులో కొబ్బరి నూనె, తేనె, పాలు కలిపి మృదువైన పేస్ట్‌గా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు పాదాలకు బాగా అప్లై చేసి 10–15 నిమిషాలు ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే చర్మం మృదువుగా మారుతుంది.
Read Also:Weight Loss: 30 రోజులు చక్కెర మానేస్తే శరీరంలో వచ్చే మార్పులు

ఇంకా మంచి ఫలితాల కోసం పాటించాల్సిన సూచనలు
- పాదాలను రోజూ శుభ్రంగా కడిగి పొడిగా ఉంచాలి
- స్నానం తర్వాత కొబ్బరి నూనె లేదా నెయ్యి రాసుకోవాలి
- రాత్రి సమయంలో సాక్స్ వేసుకుని నిద్రపోవడం మంచిది
- ఎక్కువసేపు పాదరక్షలు లేకుండా తిరగకూడదు
- నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది
ఈ విధంగా వారానికి రెండుసార్లు(Natural Care) ఈ సహజ చిట్కాను పాటిస్తే కాళ్ల పగుళ్లు తగ్గి, పాదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: