ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. అందులోనూ స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించాలనేది ఎక్కువమంది కల. శరీర బరువు తగ్గేందుకు అనేక మార్గాలు ట్రై చేస్తూ ఉంటారు. జిమ్‌కు వెళ్లడం, స్ట్రిక్ట్ డైట్ పాటించడం, ఫిట్‌నెస్ క్లాసులు, యోగా ఇలా ఎన్నో విధానాలు ఉన్నప్పటికీ, అందరికీ అవి ఉపయోగపడతాయన్న గ్యారంటీ లేదు. కొంతమందికి టైం ఉండదు, మరికొంతమందికి స్థిరంగా ఫాలో కావడం కష్టం.ఎన్ని చేసినప్పటికీ మంచి ఫలితం రాదు అటువంటివారు కొబ్బరినూనె మీ శరీరంపైన బరువు తగ్గడం కోసం చేసే మ్యాజిక్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.కొబ్బరి నూనెలో చాలా పోషకాలు ఉంటాయి. కొబ్బరి నూనె శరీరానికి కావలసిన ఎన్నో మంచి గుణాలతో సమ్మిళితమై ఉంటుంది. కొబ్బరి నూనెలో మోనో అన్సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు చాలా ఉంటాయి. ఇవి ఆహారంలో అదనపు కొలెస్ట్రాల్(cholesterol) ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. సహజంగా కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యానికి మాత్రమే ఉపయోగిస్తారు కానీ వంటకు కొబ్బరి నూనెను ఉపయోగించడం ఎంతో మంచిది.చాలా ఆరోగ్యకరమైన కొబ్బరి నూనె వినియోగం వల్ల బరువు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. కొబ్బరి నూనెను పరగడుపున తీసుకుంటే నెలరోజుల్లో మీ శరీరంలో చాలా మంచి మార్పు వస్తుంది. కొబ్బరినూనె బొద్దు కొవ్వును తగ్గిస్తుందని చెప్తారు.బరువు తగ్గాలనుకునేవారు కొబ్బరినూనెను ఏ విధంగా తీసుకోవాలి అంటే ఖాళీ కడుపుతో ప్రతిరోజు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనె తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.

కొబ్బరినూనె
కొవ్వు త్వరగా తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ కొబ్బరినూనె కలుపుకుని తాగినా మంచి ప్రయోజనం ఉంటుంది. దీనిని ప్రతిరోజు కచ్చితంగా పాటించటం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు నుండి విముక్తి లభిస్తుంది. ఒకే నెలలో మూడు కిలోల వరకు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కొబ్బరినూనె మన చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.మనం తినే ఆహారంలో ఉండే చెడుకొవ్వులు మన శరీరంలో పేరుకుపోయి బరువు పెరగడానికి కారణమవుతాయి. అయితే కొబ్బరి నూనెలో ఉండే ట్రై గ్లిజరైడ్స్(Triglycerides) ఇతర కొవ్వుల కంటే ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇక కొబ్బరి నూనెను తేనెతో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు తీసుకోవడం కూడా ప్రయోజనం ఇస్తుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.
Read Also : Nerves Weakness : నరాల వీక్‌నెస్ఏకు ఏ చిట్కాలు పాటించాలో చూద్దామా