విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఆపిల్స్ కంటే మన దేశంలో పండే కశ్మీరీ, హిమాచల్ ఆపిల్స్(Healthy Eating) ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. విదేశీ పండ్లు దీర్ఘకాలం నిల్వ ఉంచే ప్రక్రియలో పోషక విలువలు తగ్గిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలల తరబడి కోల్డ్ స్టోరేజ్‌లో ఉండే ఇంపోర్టెడ్ ఆపిల్స్‌లో విటమిన్-C స్థాయి 80–85 శాతం వరకు తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
Read Also:Healthy Lifestyle: రక్త ప్రసరణ సరిగా లేదని ఎలా గుర్తించాలి?

దేశీ ఆపిల్స్‌లో సహజ పోషకాలు పుష్కలంగా
మన దేశంలో తాజాగా పండే ఆపిల్స్‌లో సహజ యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం(Healthy Eating) మెరుగుపడటానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఇంపోర్టెడ్ పండ్లపై కనిపించే మెరిసే వ్యాక్స్ పూత ఆకర్షణీయంగా కనిపించినా, అది పోషక విలువలకు సూచిక కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
దేశీ ఆపిల్స్ తినడం వల్ల కలిగే లాభాలు
- గుండె ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి
- జీర్ణక్రియ మెరుగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది
- రోగనిరోధక శక్తి పెరుగుతుంది
- రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది
- బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది
మంచి ఆపిల్స్ ఎంచుకునే చిట్కాలు
- గట్టిగా, సహజ రంగులో ఉన్న ఆపిల్స్ తీసుకోవాలి
- అతిగా మెరిసే, మైనం పూత ఉన్న పండ్లను తప్పుకోవాలి
- తాజా వాసన ఉండే ఆపిల్స్‌ను ఎంచుకోవాలి
- తినే ముందు నీటిలో నానబెట్టి బాగా కడగాలి
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: