Health: పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు (Heart attack) లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8 నిమిషాల పాటు గుర్తుచేసుకోమని చెప్పారు. ఆ సమయంలో వారిపై జరిపిన అధ్యయనం ద్వారా వెలుగు చూసిన ఫలితాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Read Also: Suryapet: ప్రాణం తీసిన పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్

ప్రభావం ఎలా ఉంటుందంటే..?
కోపంగా ఉన్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచించే (విచ్చుకునే) సామర్థ్యం దాదాపు సగానికి పడిపోతుంది. ఈ పరిశోధనలో పాల్గొన్న వారు 8 నిమిషాల పాటు కోపంతో ఉన్నప్పటికీ రక్తనాళాలపై దాని ప్రభావం మరో 40 నిమిషాల పాటు ఉందని పరిశోధకులు చెప్పారు. బాధ లేదా ఆందోళన వంటి భావోద్వేగాలు రక్తనాళాలపై కోపం చూపించినంత తీవ్రమైన ప్రభావాన్ని చూపలేదని వివరించారు.
కోపం వచ్చినప్పుడు శరీరంలో ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ స్పందన మొదలవుతుంది. దీనివల్ల అడ్రినలిన్, కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తనాళాలను గట్టిపడేలా చేసి, రక్తపోటును మరియు హృదయ స్పందన రేటును పెంచుతాయి. “ఒక్కసారి కోప్పడితే శాశ్వత నష్టం జరగకపోవచ్చు, కానీ తరచుగా కోపగించుకోవడం వల్ల రక్తనాళాలు క్రమంగా దెబ్బతింటాయి, ఇది భవిష్యత్తులో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది” అని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: